Search
Friday 16 November 2018
  • :
  • :

చలాకీ చంటి బుల్లితెర హాస్యకిరీటీ

 జగిత్యాలలో అలరించిన జబర్దస్త్‌గా కామెడీ షో
chalaki-chantiజగిత్యాలటౌన్: జగిత్యాల శ్రీ ఆర్ట్ థియేటర్, దేవిశ్రీ గార్డెన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జబర్దస్త్ చంటి కామెడీ షో అలరించింది. వినాయక నవరా త్రోత్సవాల సందర్భంగా పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద జబర్దస్త్ ఫేం చలాకీ చంటి బృందం చేపట్టిన కామెడీ షో ఆద్యంతం ఆలరించింది. ఈ సందర్భంగా చంటికి ‘బుల్లితెర హాస్యకిరీ టీ’ అనే బిరుదును జగిత్యాల ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి చేతులమీదుగా అందజే శారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితంలో హాస్యా నికి ప్రధాన ప్రాముఖ్యత ఉందన్నారు. కామెడీ షో ద్వారా ఎంతోమందిని అలరిస్తున్న చంటి భవిష్యత్తులో సినీరంగంలో కూడా హాస్యాన్ని పండించా లని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ ఆర్ట్ థియేటర్ ని ర్వాహకులు గుండేటి రాజు, దేవిశ్రీ గార్డెన్ నిర్వాహకులు మహేశ్, ఆర్‌కె డిసి డిగ్రీ కళాశాల రామకృష్ణ, 6టివి సిఇఒ భరత్‌కుమార్, మధు, శంకర్, హరిఅశోక్‌కుమార్, దేవయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments