Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్

Smallest-Mobile

ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్‌ను బ్రిటన్‌కు చెందిన జాన్‌కో సంస్థ విడుదల చేసింది. టినీ టి1 పేరుతో దీనిని తీసుకొచ్చారు. చేతి బొటనవేలి కన్నా చిన్నగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. సాధారణ ఫీచర్‌ఫోన్‌లా పనిచేసే టినీ టి1 ద్వారా కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను చేసుకోవచ్చు. ఇందులో 300 ఫోన్ నెంబర్లు, 50 టెక్స్ సందేశాలను నిక్షిప్తం చేసుకోవచ్చు. 2జి నెట్‌వర్క్‌తో పనిచేసే టినీలో నానో సిమ్ మాత్రమే పడుతుంది. అంతేకాదు 50 వరకూ ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ డేటాను కూడా చూసుకోవచ్చు. 32 ఎంబి ర్యామ్ కలిగిన ఈ ఫోన్ అంతే అంతర్గత మెమొరీని కలిగి ఉంది. 0.49 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే కలిగిన టినీ1.. 200 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని ధర సుమారు రూ.2,280. మే 2018 నుంచి ఈ ఫోన్ అన్ని దేశాల్లో లభ్యంకానుంది.

Comments

comments