Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

స్మార్ట్ ఇంజనీరింగ్ టాస్క్ యాప్‌ ప్రారంభం

Smart Engineering Task App launched by Ktr

హైదరాబాద్: స్మార్ట్ ఇంజనీరింగ్ టాస్క్ యాప్‌ను ఐటిశాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు. టాస్క్ యాప్ ద్వారా ఇంజినీరింగ్ పనులు ఆన్‌లైన్ ద్వారా రికార్డింగ్ పర్యవేక్షణ జరగనున్నాయి. జిహెచ్‌ఎంసి ఇంజినీర్లు టాస్క్ ద్వారా పనుల నిర్వహణ, ఇంజినీరింగ్ పనులు ఆన్‌లైన్‌లో రికార్డు చేయడం, పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. పనుల్లో డబుల్ నమోదు నివారణతో పాటు పనులన్నింటినీ జియోట్యాగింగ్‌కు చేయడానికి వీలుంటుంది. నావిగేషన్‌తో ఇంటిగ్రేట్ చేసిన ఈ టాస్క్ యాప్‌తో పనుల ప్రదేశంలోనే స్వయంగా నమోదుకు అవకాశం ఉంది. ఈ టాస్క్ యాప్ ద్వారా ఏడాదికి 10 వేల పనులు ఆన్‌లైన్‌లో రికార్డు చేయవచ్చునని జిహెచ్ఎంసి భావిస్తోంది.

Comments

comments