Search
Saturday 17 November 2018
  • :
  • :

ఇక..నగరానికి స్మార్ట్ లుక్…

singh

*నిధుల కొరత లేదు …అడ్డంకులు తొలగించాలని ఆదేశం
*అందరితో కలిసి సుందరీకరణ పనుల పరిశీలన
*కరీంనగర్ అభివృద్ధి పనులపై ఎంపి వినోద్ కుమార్ ఫోకస్

మనతెలం గాణ/కరీంనగర్‌టౌన్: కరీంన గరంకు స్మార్ట్ లుక్ తీసుకురావడానికి అభివృద్ధి సుందరీకరణ పనులు కొనసాగుతు న్నాయని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ అన్నారు. శ నివారం అభివృద్ధి పనుల పరిశీలలో భాగంగా నగరంలోని ఆర్ట్ కళాశాల ఆవరణలోని మైదానాన్ని పార్కుగా నిర్మాణం చేపట్టాలన్నారు. పా ర్కు నిర్మాణానికి అడ్డంగులు ఉంటే వెంటనే తొలగించాలని, సంబంధితు లతో మాట్లాడి సమస్యలను పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని సెంటర్‌లో పార్క్ నిర్మాణం అవస రమన్నారు. రెండు మూడు రోజుల్లో నిర్మాణం పనులు చేపట్టాలని అధికా రులను ఆదేశించి స్థానిక ఎంఎల్‌ఎ,మేయర్‌లకు సూచించారు. అభివృద్ధి అడ్డుకోవద్దని ఈ సందర్భంగా ఎంపి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్, జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు ల క్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, మున్సిపల్ క మిషనర్ శశాంక, గ్రం థాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మైనార్టీ కా ర్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, కట్ల సతీష్, చల్ల హరిశంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తాం: ఎంఎల్‌ఎ
కరీంనగర్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని కరీంనగర్ ఎం ఎల్‌ఎ గుంగుల కమలాకర్ అన్నారు.శనివారం నగరాన్ని రోడ్లు అభివృ ద్ధి తో పాటు ప్రజల ఆహ్లదం కోసం పార్కులు, కళాక్షేత్రం, ఐటి టవర్‌లు అభి వృద్ధి చేయాలని ఇప్పటికి వంద కోట్లు వచ్చాయన్నారు. టిఆర్‌ఎస్ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై అక్కసుతో కొందరు కేసులు పెడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు.పార్క్ నిర్మాణం కోసం రూ.7 కో ట్లు నిధులు ఉన్నాయన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు చేపడుతామని తెలి పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. క రీం నగర్ ప్రజలకు స్మార్ట్ సిటీలో భాగంగా ఆహ్లాదకర వాతావరణాన్ని అం దించడమే ప్రభుత్వ లక్షమన్నారు.
రోడ్డు వెడల్పు పనుల పరిశీలన
నగరంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను ఎంపి, ఎంఎల్‌ఎ, జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ శశాంక, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిలు పలువురు ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి వినోద్‌కుమార్ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. .

Comments

comments