Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మాట్లాడుతుండగా పేలిన స్మార్ట్ ఫోన్…!

Smart Phone Blast while talking on Phone in Chittoor District

అమరావతి: ఫోన్ కాల్ మాట్లాడుతుండగా స్మార్ట్ ఫోన్ పేలిపోయిన సంఘటన ఎపిలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం జంగాలపల్లెలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే జితేందర్ రెడ్డి అనే వ్యక్తి 6 నెలల క్రితం ఆన్ లైన్ లో రూ. 12 వేలకు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. అయితే, సెల్ ఫోన్ మాట్లాడుతుంటే అతిగా వేడెక్కడాన్ని గమనించానని, ఆపై పొగలు కూడా వస్తుండడంతో దూరంగా పెట్టానని, చూస్తుండగానే కొద్దిసేపటి తర్వాత అది పేలిపోయిందని జితేందర్ రెడ్డి  తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు చిత్తూరులోని సదరు సంస్థ సర్వీస్ సెంటర్ కు విషయాన్ని తెలియజేయాలని సూచించారు. ఈ ఘటనతో తనకు తృటిలో ప్రాణాపాయం తప్పిందని ఆయన చెప్పాడు. ఫోన్ కు వారంటీ ఉన్నందున తనకు కొత్త ఫోన్ ఇప్పించాలని చెబుతున్నాడు.

Comments

comments