Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆనర్ ప్లే స్మార్ట్ ఫోన్ విడుదల..

Smart phone release of Honor Play with Powerful Processor

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు సంస్థ ఆనర్ ప్లే స్మార్ట్ ఫోన్ ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవాళా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రిలీజ్ అయిన ఈ ఫోన్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్, ఆనర్ స్టోర్లలో సాయంత్రం 4 గంటల నుండి అమ్మకానికి అందుబాటులోకి రానుంది. గత నెల చైనాలో ఈ ఫోన్  విడుదలైన సంగతి తెలిసిందే. 4జిబి వేరియంట్ ధ‌ర రూ.19,999 ఉండగా, 6జిబి వేరియంట్ ధ‌ర రూ.23,999గా ఉంది. గేమింగ్ సూట్ ఫీచర్ ని కూడా కలిగి ఉన్న ఈ ఫోన్ నేవీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్లలో  వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఆనర్ ప్లే అద్భుత ఫీచర్లు…

హైసిలికాన్ కిరిన్ 970 ప్రాసెసర్, 6.3 డిస్‌ప్లేతో పాటు 1080×2340 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ బ్యాక్ కెమెరా, 16/2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా, 16 మెగాపిక్సెల్, ఇంటర్నల్ స్టోరేజ్, 64జిబి మెమొరీ కార్డు ద్వారా 256 వరకు పెంచుకునే సౌకర్యం, 3750ఎంఏహెచ్‌ బ్యాట‌రీ.

Comments

comments