Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బాక్సింగ్‌డే టెస్టుకు స్మిత్ రెడీ

smt

మెల్‌బోర్న్: ఇంగ్లాండ్‌తో మంగళవారం ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సిద్ధంగా ఉన్నాడని జట్టు వర్గాలు  వెల్లడించాయి. ఈ టెస్టులో అతను బరిలోకి దిగడం ఖాయమని వారు వివరించారు. నాలుగో టెస్టును పురస్కరించుకొని ఆస్ట్రేలియా జట్టు ఆదివారం మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేసింది. అయితే సందర్భంగా స్మిత్ చేతికి గాయమైంది. దీంతో అతను ప్రాక్టీస్ మధ్యలోనే వెళ్లిపోయాడు. దీంతో అతని ఫిట్‌నెస్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం కాలేదని తేలింది. దీంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరుగనుంది. కీలకమైన ఈ బాక్సింగ్‌డే టెస్టును రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే 30తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక జట్టు క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. స్మిత్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అతను గాయం బారిన పడడంతో నాలుగో టెస్టులో అతను ఆడతాడా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే స్మిత్ నాలుగో టెస్టులో ఆడతాడని జట్టు యాజమాన్యం సంకేతం ఇచ్చింది. ఇదే విషయాన్ని జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా మీడియాకు వెల్లడించాడు.

Comments

comments