Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పొగ మానేస్తే…

Lungs2ప్రతిరోజూ 50 మి.గ్రా విటమిన్ ఇ వాడకం న్యుమోనియాను అడ్డుకుంటుందని ప్రయోగపూర్వకంగా డాక్టర్ హార్రిహెమిలా, యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, ఫిన్‌ల్యాండ్ నుంచి తెలిపారు. వీరు సిగరెట్టును కాల్చే అలవాటున్న పురుషులు, సిగరెట్టును మానేసిన కొన్ని సంవత్సరాలు విటమిన్ ఇ మాత్రల వాడకం న్యుమోనియాను అరికట్టగలదనే కోణంలో పరిశోధనను కొన్ని దశాబ్దాల కాలం నుంచే సాగించారు.
ATBC ( ఆల్ఫా టోకోఫెరాల్ బీటా కెరొటిన్ కాన్సర్ ప్రివెన్షన్ స్టడీ) (1985-1993) విశ్లేషణ ప్రకారం పొగాకును మానేసినప్పటి వయస్సుకూ, విటమిన్ ఇ ప్రభావానికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుందని ధృవీకరించినట్లు హార్రి తెలిపారు. 7469 మందిపై జరిపిన పరిశోధన ప్రకారం 21 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సులో పొగాకుకు అలవాటైన వారిలో 35 శాతం మందికి విటమిన్ ఇ మాత్రలు పనిచేశాయి. 21 సంవత్సరంలో 28 మంది సిగరెట్టుకు బానిసైన వారిలో ఈ ప్రభావం కనిపించలేదు. కేవలం సిగరెట్టును ఓ ఆటవిడుపుగా అప్పుడప్పుడూ కాల్చేవారిలో 69 శాతం మందికి పైగా విటమిన్ మాత్రలు సత్ఫలితాలనిచ్చాయి. దాదాపు 72 శాతం విమమిన్ ఇ సత్ఫలితాలు సిగరెట్టు కాల్చే అలవాటుకు స్వస్తి చెప్పిన వారిలో కనిపించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని ప్రయోగాలు అవసరమని హ్యారీ చెబుతున్నారు.

Comments

comments