Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సైనికులతో స్మృతి ఇరానీ రాఖీ పండుగ

smriti-iraniన్యూఢిల్లీ : రాఖీ పర్వదినాన్ని కేంద్ర మంత్రి స్మృతిఇరానీ మరింత ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. సరిహద్దులో ఉంటూ దేశం కోసం అహర్నిశలు శ్రమించే సైనికులతో ఈ వేడుకలు చేసుకోనున్నారు. రాఖీ పర్వదినాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ హిమనీనదానికి స్మృతి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆగస్టు 18న సియాచిన్ వెళ్లేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నుంచి స్మృతికి అనుమతి లభించింది.
స్మృతి పర్యటన కోసం ఆర్మీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనుంది. స్మృతి ఇరానీతో పాటు మరో 8 మంది బిజెపి మహిళ ఎంపిలు కూడా దేశ సరిహద్దుల్లో రాఖీ పండుగ జరుపుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వీరు రాజస్థాన్, కశ్మీర్‌లలోని సరిహద్దులకు వెళ్లి జవాన్లకు రాఖీ కట్టనున్నారు.

Comments

comments