Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి

RED-SANDEL

ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా పెంబి మండలం రాగిదుబ్బనాల అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం అటవీశాఖ సిబ్బందిపై కలప స్మగ్లర్ల దాడి చేశారు. అటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో 15 మంది కలప స్మగ్లర్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. కలప తరలిస్తున్నారనే సమాచారంలో రెండు బృందాలు గాలింపు చర్యలు చేపడుతుండగా స్మగ్లర్లు దాడి చేశారు. ఘటనా స్థలిలో మూడు లక్షల రూపాయల విలువైన కలప, ఏడు బండ్లను అటవీ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలకు చెందిన కలప స్మగ్లర్లు దాడి చేసినట్లు డిఎఫ్‌ఒ వెల్లడించాడు.

Comments

comments