Home ఆఫ్ బీట్ వీడియోలు అలా డోర్ తీయగానే.. ఇలా కాటేసిన పాము…(షాకింగ్ వీడియో)

అలా డోర్ తీయగానే.. ఇలా కాటేసిన పాము…(షాకింగ్ వీడియో)

Snake Bites Manఓక్లహోమా: అగ్రరాజ్యం అమెరికాలోని ఓక్లహోమాలో ఓ ఇంటి డోర్ బెల్ కెమెరాలో రికార్డైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి ఇంటి డోర్ తీస్తుండగానే పాము అతన్ని కాటేసింది. తన స్నేహితుడిని కలవడానికి వెళ్లిన సదరు వ్యక్తి ఇలా పాముకాటుకు గురయ్యాడు. డోర్ తీయగానే దానిపై ఉన్న పాము ఎగిరి వ్యక్తి నుదిటిపై కాటేయడం వీడియోలో రికార్డైంది. దాంతో వెంటనే అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమయానికి చికిత్స అందించడంతో పాటు కాటేసిన సర్పం విషపూరితమైనది కాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. జెరెల్ హేవుడ్ అనే వ్యక్తి తన మిత్రుడు రోడ్నీ కోప్లాండ్ నివాసముండే ఓక్లహోమాలోని లాటన్ లో ఉండే ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

Snake Bites Man On Face While Opening Door