Home ఆంధ్రప్రదేశ్ వార్తలు అరుదైన పామును కొట్టి చంపిన ప్రజలు

అరుదైన పామును కొట్టి చంపిన ప్రజలు

Snakeఅనంతపురం : పెనుకొండలో అరుదైన పాము కనిపించింది.  ఈ పాము ఒకరిని కాటేసింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పామును స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటన  స్థానిక మారుతీ నగర్ లో  జరిగింది. ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి  ఇంట్లోని పాత సామాన్లు తీస్తున్న సమయంలో అరుదైన పాము అతన్ని కాటేసింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు  పామును కొట్టి చంపేశారు.  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదా శివయ్య ఈ పామును పరిశీలించారు.  ఇది అరుదైన పాము అని, ఈ పాము విష రహితమని ఆయన తెలిపారు. దీన్ని లైకోడాన్‌ ఫ్లబికొల్లిస్‌ అన్న శాస్త్రీయనామంతో పిలుస్తారని ఆయన చెప్పారు. తిరుమల కొండల్లో మాత్రమే ఈ పాములు కనిపిస్తాయని ఆయన వెల్లడించారు.

Snake Killed by People at Penukonda