Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇంద్రకీలాద్రి గుడిపై పాము కలకలం…

Snake on Indrakeeladri temple

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం పాము కనిపించింది. ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలో ఒక్కసారిగా పాము దర్శనం ఇవ్వడంతో భక్తులు భయాందోళనలకు లోనయ్యారు. తక్షణమే రంగంలోకి దిగిన ఆలయ సిబ్బంది క్యూలైన్ ను నిలిపివేసి, పామును పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఆలయ మార్గంలో కలుగులు ఉండటంతో సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు. అధికారులు పాములు పట్టేవారికి సమాచారం అందించారు. తవ్వకాలు జరిపినప్పటికి పాము కనిపించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందుగానే భక్తులను నిలిపివేశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Comments

comments