Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

సజీవంగా స్నేక్ షార్క్

  Fish

రాక్షస బల్లుల కాలానికి చెందిన అరుదైన జాతి షార్క్ పోర్చుగల్ తీరంలో కనిపించింది. పామును పోలిన తలతో 300 దంతాలతో ఈ షార్క్ ఇప్పటికీ అట్లాంటిక  తిరుగుతోంది. ఆరడుగుల పొడవున్న ఈ జాతి 8 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల కాలానికి చెందినది. కాలక్రమంలో డైనోసార్లు, టైరనోసార్లతో పాటు స్నేక్ షార్క్‌లు కూడా అంతరించిపోయాయనే అంతా భావించారు. కానీ అది సజీవంగా ఉండి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అల్గర్వే తీరంలో యూరోపియన్ యూనియన్ పరిశోధకుల బృందం 701 మీటర్ల లోతున దీన్ని చూశారు. దీన్ని సజీవ శిలాజంగా పేర్కొన్నారు. క్లమిడోస్లేచస్  యాం గినస్ గా దీనికి పేరు పెట్టారు.  ఇవిఇతర షార్క్‌లు, చేపలు, ఆక్టోపస్‌ల శరీరాలను చీల్చి ఆహారంగా తీసుకుంటాయని అల్గర్వే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో స్నేక్ షార్క్‌లు నివాసముంటున్నట్లు వెల్లడించారు.

Comments

comments