Search
Saturday 17 November 2018
  • :
  • :

ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు స్నాప్‌డీల్ బోర్డు అనుమతి

Onlineబెంగళూరు: మరోసారి ఫ్లిఫ్‌కార్ట్ చేసిన ఆఫర్‌కు ఆన్‌లైన్ మార్కెట్ స్నాప్‌డీల్ అంగీకరించింది. 900-950 మిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆఫర్ చేసింది. స్నాప్‌డీల్ బోర్డు బుధవారం సమా వేశం దీనిపై ఓ నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ డీల్ ప్రస్తుత స్నాప్‌డీల్ వాటాదారుల అనుమతి కోసం చూస్తోం దన్నారు. దీనిపై స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ ఇరు సంస్థలు ఎలాంటి వివరాలు తెలియజేయలేదు. అమెరికా ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ నుంచి దేశీయ ఇ-కా మర్స్ సంస్థలు గట్టి పోటీని ఎదుర్కొంటున్నా యి. దేశంలో ఇప్పటికే అత్యధిక వినియో గదారులను కల్గి ఉన్న ఫ్లిప్‌కార్ట్ పోటీకి తగిన విధంగా మరిం తగా పెట్టుబడులను పెడుతూ, మార్కెట్ పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ స్నాప్‌డీల్‌కు అతి పెద్ద ఇన్వె స్టర్‌గా ఉంది. అయితే నష్టాల్లో ఉన్న స్నాప్‌డీల్-ఫ్లిప్‌కార్ట్ మధ్య డీల్‌కు జపాన్ సంస్థ కూడా అత్యం త ఆసక్తి చూపిస్తోంది.  గతంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్నాప్‌డీల్‌ను విలీనం చేసుకునేందుకు గాను 850 మిలియన్ డాలర్ల ఆఫర్‌ను చేయగా.. అత్యంత తక్కువ అంటూ స్నాప్‌డీల్ తిరస్క రించడమే కా కుండా ఇతర కంపెనీలతో జట్టు కట్టేందుకు ప్రయ త్నాలు మొదలు పెట్టింది. ఇన్ఫీ బీమ్‌తో స్నాప్‌డీల్ విలీన చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఫ్లిప్ కార్ట్ మరోసారి 950 మిలియన్ డాలర్ల ఆఫర్‌తో ముందుకురా వడంతో స్నాప్‌డీల్ అంగీకారానికి వచ్చింది.

Comments

comments