Home ఆఫ్ బీట్ మా ఊరికే గర్వకారణం..మా అమ్మాయి

మా ఊరికే గర్వకారణం..మా అమ్మాయి

 Snehareddy Find a job in Google

వ్యవసాయ కుటుంబంలో జన్మించి రాజకీయాలను శాసించిన ఓ కురు వృద్ధుని కుటుంబం నేడు అందరిని ఆకర్షించింది. అతని మనుమరాలు గూగుల్‌లో ఉద్యోగం సంపాదించి ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం సాధించింది. వికారాబాద్ జిల్లాలోని కర్ణాటక సరిహద్దున గల బంట్వారం మండలానికి చెందిన కె. ప్రభాకర్‌రెడ్డి మనుమరాలు స్నేహారెడ్డి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
హైదరాబాద్‌లో ఐఐటి చదివిన స్నేహారెడ్డి రూ.1.20కోట్ల వార్షిక వేతనం, అదనంగా మరో రూ.20లక్షల ప్రోత్సాహకంతో గూగుల్ సంస్థ ఆమెను నియమించుకుంది. ఆ సంస్థ చేపట్టిన కృత్రిమ మేధపై సాగిస్తున్న ప్రాజెక్టులో పరిశోధనలు చేసేందుకు స్నేహను ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా దక్కిన అరుదైన ఐదుగురిలో స్నేహారెడ్డి ఒకరు కావడం విశేషం. గూగుల్ మెచ్చిన ఈ తెలుగమ్మాయి వికారాబాద్ జిల్లా బంట్వారం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ వేత్త కె. ప్రభాకర్‌రెడ్డి మనుమరాలు. ప్రభాకర్‌రెడ్డి రెండవ కొడుకు సుధాకర్‌రెడ్డి, ఉష దంపతుల కూతురు స్నేహారెడ్డి. ఇటీవల ఈ విభాగంలో ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచి రెండు వారాల క్రితం రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంది.
ఆమె తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడినా ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చారు. స్నేహారెడ్డ్డి బాల్యం నుంచి హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం చేసింది. హోక్రేడ్ ఉన్నత పాఠశాల, ఫిట్జిలో ఇంటర్ పూర్తి చేసింది. ఇంతటి ప్రతిభను కనబరిచిన స్నేహారెడ్డ్డి రైతు కుటుంబం నుంచి రావడం పట్ల ఈ ప్రాంతవాసులు గర్వకారణంగా భావిస్తున్నారు. స్నేహారెడ్డి విజయం వెనుక తాత కె.ప్రభాకర్‌రెడ్డి, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా స్నేహారెడ్డి తండ్రి సుధాకర్‌రెడ్డితో మన తెలంగాణ సకుటుంబం ముచ్చటించింది.
స్నేహారెడ్డి విజయం వెనుక
ఎవరున్నారు?
నాన్న గారు వ్యవసాయ, రాజకీయ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా రు. కానీ నేను, నా సతీమణి ఉషారెడ్డి పిల్లల కెరీర్‌పై దృష్టి సారించాం. నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీరు, ఉష ఎంఎస్‌సి పూర్తి చేసింది. ఆమె అనంతపూర్ విశ్వవిద్యాలయంలోనే జువాలజీలో టాపర్‌గా నిలిచింది. మా ప్రభావం పిల్లలపై ఉంది. మా ఇద్దరు తోబుట్టువులు, బా వలు ఉన్నత విద్యావంతులే. స్నేహారెడ్డి చిన్నప్పటి నుంచీ తెలివైన అమ్మాయి. ఆమె పడిన శ్రమ వృథా కాలేదు. ఎన్నో కంపెనీలు అవకాశం కల్పించినా ఆమె నిరాకరించింది. అంతర్జాతీయ స్థాయి లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని గూగుల్ సంస్థను ఆకర్షించింది.
స్నేహ చదువులు ఎలా, ఎక్కడ సాగాయి..
ఎనిమిదవ తరగతి వరకు హైదరాబాద్‌లోని హోక్రేడ్ ఇంటర్నేషనల్ స్కూలులో విద్యాభ్యాసం జరిగింది. తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఫిట్జీలో పూర్తి చేసింది. 2012లో టెన్త్ ఉత్తీర్ణత సాధించి 2014 నుంచి 2018 వరకు ఐఐటి హైదరాబాద్‌లో అభ్యసించింది. ప్రతి తరగతిలో ఆమె టాపర్‌గా నిలిచింది. ఒలంపియాడ్ మ్యాథ్స్, సైన్స్‌లో నాలుగుసార్లు ఆల్‌ఇండియా ర్యాంకులు సాధించింది.
కుటుంబంలో ఉన్నత విద్యను ఎవరెవరు అభ్యసిస్తున్నారు…
స్నేహ తమ్ముడు కృతిక్‌రెడ్డి కూడా అదే పాఠశాలలో చదువుతున్నా… క్రికెట్‌పై మక్కువ చూపిస్తున్నాడు. ఈ మధ్య పలు సార్లు అండర్-16లో ఆడి ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచారు. మా సోదరి పిల్లలు మెడిసిన్ పూర్తి చేశారు. మ రొకరు సివిల్స్ రాశారు. ఐఏఎస్‌కు ప్రయత్నాలు కొనసాగిస్తున్నది.
మీరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు?
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఉద్యోగం చేశాను. ప్రస్తుతం ఇక్కడే పని చేస్తున్నాను.
స్నేహారెడ్డి ముందున్న లక్షం..
స్నేహారెడి ్డప్రస్తుతం ఎంపికైన విభాగంలోనే పిహెచ్‌డి చేయాలనుకుంటుంది. సాకారం దిశగా ఆమె ముందుకు సాగుతోంది. మా భార్య లక్షం కూడా ఇదే. ఆమె సంపూర్ణ సహకారం వల్ల పిల్లలు మంచి చదువులు సాధ్యమవుతున్నాయి. మా అమ్మాయి వెంటే మేమంతా…శెట్టి రవిశంకర్