Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రమాద మలుపులు

Road-Accident

అశ్వాపురం : అశ్వాపురం మండలంలోని వివిధ గ్రామాల మధ్యలో ఉన్న ప్రమాదకరమైన మూలమలుపులతో ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతూ, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలువుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు మండల వాసులు వాపోతున్నారు. మండలంలోని మొండికుంట- మల్లెలమడుగు, మల్లెమడుగు- రామచంద్రాపురం, మొండికుంట- నెల్లిపాకబంజర, మొండికుంట- తుమ్మలచెరువు- కుర్వపల్లికొత్తూరు తదితర గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం మండల కే్రందానికి వస్తూ పోతూ ఉంటారు. ఇలాంటి దారిలో అతి ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. ఎదుటి వాహనం దగ్గరికి వచ్చే వరకు కనిపించకపోవడంతో నిత్యం ఏదో ఒకసారి ప్రమాదం జరుగుతూనే ఉంటుందని, రోడ్డు మూలమలుపు సూచికల బోర్డులు లేకపోవడం, దగ్గరలో వేగనియంత్రణలు(స్పీడ్ బ్రేకర్స్) లేకపోవడం, వేగంగా వచ్చిన వాహనాన్ని సడన్‌బ్రేక్ వేయడంతో పడిపోయి ద్విచక్రవాహన చోదకులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న మూలమలుపుల వద్ద సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నియంత్రించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments