Search
Thursday 15 November 2018
  • :
  • :

మౌనమేల

పోరపాటు జరిగిందంటే ఉన్నతాధికారులు ఏమంటారోనన్న భయం కిందిస్థాయి సిబ్బందిలో ఉండేది. దీంతో తప్పు చేయాలన్నా భావన రాగానే ఉన్నతాధికారులు గుర్తుకు వచ్చే వారు. ఐదారు సంవత్సరాలుగా పాలన పరమైన అనేక పోరపాట్లు జరిగినా చర్యలు తీసుకోకపోవడంతో ఏమవుతుందిలే అన్న భావన పెరిగిపోతుంది. ప్రజల ఇబ్బందులు, విజ్ఞప్తుల పట్ల ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంతో చేతులు తడపందే పనులు అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. దశాబ్దా కాలం క్రితం లంచాలు గుంజే అధికారులు ఖమ్మం రావాలంటే భయపడేవారు. ఇప్పుడు ఖమ్మం వదిలి పోవడం లేదు.

Bribe1

ఖమ్మం ప్రతినిధి: ఐదారు సంవత్సరాల్లో ఎన్నడు లేని రీతిలో ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. కొద్ది మంది అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తూ ఉద్యోగం అంటే ప్రజాసేవ అన్న భావనతో పనిచేస్తున్నారు. ఏం చేస్తే ఏం వస్తుంది అన్న భావనతోనే పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుంది. ఈ అవినీతి బట్టబయలైనా చర్యలు తీసుకోకపోవడం మరింత చర్చనీయాంశమైంది.

చర్యలు ఉండవన్న ధీమా మరింత అవినీతి పెరిగుతుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక ఉన్నత స్థాయి అధికారి పైన కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చర్యలు తీసుకోకపోవడమే గాక ఆ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించి అవినీతికి పరోక్షకంగా లైసెన్సు ఇచ్చారు. రెవిన్యూలోనూ ఇదే దుస్థితి. ప్రభుత్వ భూముల కైంకర్యం మొదలు పలు ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేసిన అధికారులను కిమ్మనలేదు. మండల స్థాయిలో ఉపాధిహామీలో అవినీతి గుట్టురట్టయినా రికవరీకి నోచుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి దొంతరలు చాలా ఉన్నాయి. అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది పట్ల చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారుల మౌనం పలు విమర్శలకు తావిస్తుంది.

ఆధారాలతో సహా తప్పులు నిరూపితమైన కనీసం బదిలీ కూడా చేయకపోవడం మరి కొంత మంది ఆలోచనను మార్చివేస్తుంది. గతంలో అవినీతి మకిలం అంటిన అధికారులు ఖమ్మం జిల్లాలో పనిచేసేందుకు జంకే వారు. ఇక్కడ ప్రశ్నించే వారు ముఖ్యంగా చైతన్యం ఎక్కువగా ఉన్న భావన రాష్ట్ర
మంతటా ఉండేది. ఇప్పుడు ఈ జిల్లాను వదిలి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏదో ఒక పైరవీ ద్వారా ఇక్కడ తిష్ట వేస్తున్నారు.ప్రజాప్రతినిధులు నోరు విప్పడం లేదు. అవసరమైతే సమర్థిస్తున్నారు. కానీ చర్యలకు సిఫారసు చేయడం లేదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి ఫలాలు అర్హులకు అందడం లేదు. ఇప్పటికైనా అవినీతి అధికారులపై సత్వర చర్యల దిశగా ఆలోచన చేయాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు.

Comments

comments