Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘వైకుంఠ’ రాముడు

భద్రాద్రిలో కనుల పండువగా తెప్పోత్సవం
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

teppotsvam

భద్రాచలం: వైకుంఠ ఏకాదశిని పురస్కరించు కొని భద్రాద్రి రాముని తెప్పోత్సవం ఆదివారం కనులవిందుగా సాగింది. గర్భగుడిలో స్వామి వారి దర్బారు సేవ అనంతరం అర్చకులు ఉత్సవమూర్తులకు విశ్వక్షేణపూజ, పు ణ్యహావచనం పఠించారు. పుణ్య జలాలతో హంస వాహనానికి సంప్రోక్షణ చేసి న పండితులు సీత, లక్ష్మణ సమేతుడైన రామయ్యను తెప్ప పై ఆసీనులను గావిం చారు. వేద పండితుల మంత్రాల నడుమ రాములోరు నది విహారం చేస్తుండగా వేలాదిగా తరలివచ్చిన భక్తజనం పులకించింది.

మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలు గులతో నది తీరం పున్నమి కాంతులను సంతరించుకుంది. ఈ కార్యక్ర మంలో సిఎం కెసిఆర్ సతీమణి శోభ, మనుమడు హిమాన్స్, ఎంపి సీతారాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, ఎంఎల్‌సిలు పోంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఎంఎల్‌ఎలు సున్నం రాజయ్య, జల గం వెంకట్రావ్, వంతల రాజేశ్వరి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జెసి రామ్‌కిషన్, ఎస్‌పి అంబర్ కిషోర్ ఝా, డిఐజి రవివర్మ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, జిల్లా న్యాయ మూర్తి లక్ష్మణ్ రావు, భద్రాచలం జడ్జి బులి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Theppotsavam

Comments

comments