Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వన దేవతలకు మొక్కులు

Medaram Festival

తాడ్వాయి: మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో మేడారానికి చేరుకున్నారు. ముందుగా జంపన్నవాగు వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్దకు చేరుకుని సంప్రదాయ పద్ధతిలో తల్లులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బెల్లం(బంగారం), గాజులు, చీరెసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర పరిసరాల్లో భక్తులు విడిది చేసి సందడి చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎస్‌ఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Comments

comments