Home జగిత్యాల చెరువుల్లో నీటి కరువు… ఆందోళనలో మత్య్సకారులు

చెరువుల్లో నీటి కరువు… ఆందోళనలో మత్య్సకారులు

Fish-Died-in-Lake

కోరుట్లరూరల్: వేసవి కాలం తీవ్రతంగా మారుతున్న క్ర మంలో చెరువుల్లో నీటి కరువు ఉండడంతో చేపలు మృత్యువాత పడుతుంటే మత్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క ప్రభుత్వం మత్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని కృషి చేస్తు లక్షల చేప పిల్ల లను సరఫరా చేసి చెరువుల్లో పోయడం జరుగుతుంది.

అయితే వేసవి వేడికి చెరువుల్లో చేపలు మృత్యువాత పడుతుంటే వాటిని అమ్ముకుని జీవనం సాగించాలనే మత్య కార్మికుల ఆశలు అడియషలుగా మారుతున్నాయని కోరుట్ల మండల పరిధిలో 18గ్రామాల్లో మత్యకార్మికుల కుటుంబాలు ఉన్నా యని సంబంధిత అధికారులు చెరు వులను పరిశీలించాలని కోరుతు చేపలు మృతి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మత్య కార్మికులు వా పోతున్నారు.

చిన్నమెట్‌పల్లి చెరువులో చేపల మృతి…

గత వారం రోజుల క్రితం మండలంలోని చిన్నమెట్‌పల్లి గ్రామంలోని పెద్ద చె రువులో వేల చేపలు మృత్యు వాత పడ్డాయి. గ్రామ మత్య కార్మికులు 1. 50 లక్షలతో సుమారు లక్ష చేపలు చెరువులో పోశామని ఆవి మృతి చెం దాయని పలుమార్లు చెరువుల్లో చేపలు బతికేందుకు మందులు చల్లిన అవి మృత్యువాత పడుతునే ఉన్నాయని 150 మత్య కార్మిక కుటుంబాల బతు కుల్లో ఆందోళన గురవుతున్నాయని ప్రభుత్వం నష్టపో యిన మత్య కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు కర్నాల నర్సయ్య, దువ్వాక ర మేష్, కల్లెడ దివాకర్, దువ్వాక లక్షీనర్సయ్య, దువ్వాక రాజేష్,కల్లెడ నారా యణ, దువ్వాక నరేష్‌లు కోరుతున్నారు.