Search
Tuesday 20 November 2018
  • :
  • :

ప్రభుత్వ పాఠశాలలో ఆణిముత్యాలు

ప్రతి విద్యార్థి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

Intelligent

వనపర్తిటౌన్: ప్రతి విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేలా తీర్చిదిద్దాలన్న లక్షంతోనే ఉపాధ్యాయులు వారిని ముందుకు తీసు కెళ్లాలని జిల్లా జెసి నిరంజన్ రావు సూచించారు మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో విద్యావైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జెసి నిరంజన్‌రావు జిల్లా ఎక్పైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ కుమార్, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు హాజరై ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వ లన గావించారు. అనంతరం జెసి మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో మార్పుల కనుగుణంగా మారుతూ విద్యను అభ్యసించాలన్నారు .

ఈ వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని విద్యార్థులను బట్టి చదువును కాకుండా ప్రయోగాల ద్వారా వారి కి విద్యాబోధన చేయాలన్నారు. ఈ సందర్బంగా డిఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఉండే మనోధైర్యం చాలా విశిష్టమైనదిగా ఉంటుందని వారిని గుర్తించి వారి నైపుణ్యాలను తగినట్లుగా తీర్చి దిద్దాలని కోరారు. అనంతరం చిన్నారి రుషిక కూచిపూడి నృత్యప్రదర్శన అధికారులను , విద్యార్థులను అలరింపజేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఎంఓ అధికారి మధుకర్, జిల్లా సైన్స్ అధికారి నాగేందర్‌గౌడ్, మండల విద్యాధికారి ఫయో జుద్దిన్, అదే విధంగా ప్రదర్శనలో జడ్జిలుగా శాస్త్రవేత్తలు వరలక్ష్మీ, కాకతీయ యూనివర్సిటి పిజిక్స్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ లక్ష్మీభవాని,(ఉస్మానియా యూనివర్సిటి ) బాటనీ డిపార్ట్‌మెంట్ , డాక్టర్ ఎకెడి భవాణి, (ఉస్మానియా యూనివర్సిటి ) కెమిస్ట్రి డిపార్ట్‌మెంట్ , వ్యవహరించారు.

డాక్టర్ వరలక్ష్మీ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ …
(కాకతీయ యూనివర్సిటి)
ప్రయోగాలపై విద్యార్థుల ఆసక్తిని గ్రహించి వారిని ఆవిద్యపై దృష్టి సారించేలా తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు , ఉపాధ్యాయుల మీద చాలా ఉంటుంది.

డాక్టర్ లక్ష్మీభవాని బాటనీ డిపార్ట్‌మెంట్ …
(ఉస్మానియా యూనివర్సిటి)

ఖరీదైన వాటితో కాకుండా తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయించాలి ఏదో ఒక ప్రదర్శనలకు కాకుండా నిరంతరం పాఠశాలలో ప్రయోగాల ద్వారా పాఠాలు బోదించాలి. ముఖ్యంగా ఈ విషయంలో గ్రామీణ ప్రాంతంలో చదివే విద్యార్థు లకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
డాక్టర్ ఎకెడి భవాని, కెమిస్ట్రి డిపార్ట్‌మెంట్ ..

(ఉస్మానియా యూనివర్సిటి)
ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వస్తువులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వాటిని ఉప యోగించుకుని ఎంతో విజ్ఞానాన్ని అందించవచ్చు. ఉపా ధ్యాయులు ప్రస్తుత సైన్స్ టెక్నాలజీపై ఇంటర్‌నెట్ ద్వారా అనేక అంశాలను సేకరించి విద్యార్థులకు ఎన్నో ప్రయో గాలను నేర్పవచ్చును .

Comments

comments