Home రాష్ట్ర వార్తలు గిరిజన విద్యకు చేటు

గిరిజన విద్యకు చేటు

బడుల విలీనంపై విమర్శల వెల్లువ -వందల స్కూళ్లపై వేటుకు రంగం సిద్ధం

                Teachers

మన తెలంగాణ ప్రతినిధులు : రాష్ట్రంలో 20లోపు విద్యార్థులున్న పాఠ శాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణ యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తండాలు, ఏజెన్సీ ప్రాంతాలలోని స్కూళ్ల ను విలీనం చేయడం ద్వారా అక్కడి విద్యార్థులు చదు వుకు దూర మయ్యే ప్రమాదం ఉందని స్థానికులు వా పోతు న్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాలలో అక్ష రాస్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో పాఠశాలల విలీన ప్రక్రి య వల్ల మరింత తగ్గే ప్రమాదం ఉందని చెబు తున్నారు. క్రమబద్ధ్దీకరణ పేరుతో స్కూళ్లను మూసి వేసే ప్రయత్నం చేస్తున్నారని, గిరిపుత్రులను ప్రాథ మిక విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపి స్తున్నారు.

మైదాన ప్రాంత ప్రజలతో గిరిజనులు మ మేకం కావాలని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ఆ వర్గాల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలను విలీనం చేయాలనే యోచనపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. కొత్తగూడెం-భద్రాద్రి జిల్లాలో 98 స్కూళ్లు, నిజామాబాద్‌లో 82, కామారెడ్డిలో 151, రంగారెడ్డిలో 120, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 662 స్కూళ్ల మూసి వేత జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధ్దం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో సున్నా ఎన్ రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలు 460 ఉండగా,1- 10 మధ్య విద్యార్థులున్న పాఠశాలలు 1,285, 11-20 మధ్య విద్యార్థులున్న స్కూళ్లు 2,892 ఉన్నాయి. మొ త్తం 4,637 సర్కారు స్కూళ్లలో 20లోపు విద్యార్థు లు న్నారు.

సమీప పాఠశాలలో వీటిని విలీనం చేసేం దుకు విద్యా శాఖ నిర్ణయానికి అనుగుణంగా జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధ్దం చేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అధికారులు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలతో, ఆయా గ్రామ పెద్దలతో చర్చి స్తున్నారు. అయితే ఈ పాఠశాలలను సమీప గ్రామా లలోని పాఠశాలల్లో విలీనం చేసి విద్యార్థులకు రవా ణా సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ భావిస్తు న్నట్లు తెలిసింది. బస్సు లేదా ఆటోల ద్వారా రవాణా సౌకర్యాలు కల్పించడం లేదా రవాణా నిమిత్తం ఒక్కో విద్యార్థికి నెలకు రూ.300 ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రాథమిక, ప్రాథకోన్నత పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య 20లోపు ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోతే సమీప పాఠశాలల్లో విలీనం చేయడమే ఉత్తమమని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నానట్లు తెలిసింది.