Home వనపర్తి సదరం క్యాంపులో… గందరగోళం

సదరం క్యాంపులో… గందరగోళం

ఊహించిన దాని కంటే వేలాదిగా తరలివచ్చిన దివ్యాంగులు
అసౌకర్యాల మధ్య ఇబ్బందులు.. కనీస సౌకర్యాలు కరువు
సదరం శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ శ్వేతామహంతి

Collector

వనపర్తి ప్రతినిధి: వనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం గురువారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపు గందరగోళంగా మారింది.  అధికారులు ఊహించిన దానికంటే వేల మంది దివ్యాంగులు కదిలి రావడంతోజూనియర్ కళాశాల లో గందర గోళ పరిస్థితి ఏర్పడింది. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారిగా సదరం క్యాంపు నిర్వహించడం తో పాటు అటు కొత్తగా సర్టిఫికెట్స్ పొందేవారు, ఉన్న సర్టిపికెట్లను రెన్యూవల్ చేయించుకునేం దుకు భారీగా తరళివచ్చారు.

అధికారుల ఏర్పా ట్లు అంతంత మాత్రమే ఉండడంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది.  శిబిరాన్ని ఉదయమే కలెక్టర్ సందర్శించి ప్రారంభించనప్పటికి క్యూ లైన్‌లో జనాలు వేచి ఉండడం వల్ల గంటల తరబడి నిలిచిఉండలేక దివ్యాంగులు ఇబ్బందులకు గురైయ్యారు.  దాదా పు 3000 దాకా సదరం క్యాంపుకు తరలిరావడంతో పలు మండ లాల నుండి  వచ్చిన వారు ఒక్క సారిగా టోకెన్‌లు తీసుకొని కళాశాల లోపలికి వెళ్లడం వల్ల ఎవ్వరు ఏ వైద్యుని దగ్గరికి వెళ్లాలో వైద్యులు, గదుల వివరాలు తెలియక దివ్యాంగులు వారి వెంట వచ్చిన సహాకులు ఇబ్బందులకు గురైయ్యారు. ఉదయం నుండి సాయంత్రం దాకా క్యూ లైన్‌లో ఉన్న దివ్యాంగులు పూర్తి గా నీరసించి పోయారు.  కేవలం ఒకే ఒక రోజు సదరం క్యాంపు ఉండడంతో  ఆందోళనగా దివ్యాంగులు ఎగబడ్డారు.

 గురువారం సదరం క్యాంపులో దాదా పు 3000 వేల మంది దాకా తరలిరాగా కేవలం 455 మంది దివ్యాంగులను డాక్టర్లు పరీక్షించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి  సదరం క్యాంపు దగ్గరకి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించిన సమస్య సద్దుమనుగలేదు. ఒక్క సారిగా తరలిరా వడంతో పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు.