Home మన ఆరోగ్యం లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

లవంగాలు మసాలా దినుసుగా మనందరికీ తెలుసు. వంటల్లో వాడటం వల్ల చక్కని రుచి వాసన  కలిగిస్తుంది. లవంగాలు లేకుండా నాన్‌వెజ్ వంటకాలు ఉండనే ఉండవు.  ఇండోనేషియాలోని స్పైసీ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్ దీవులు లవంగాల స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్, ఇండియా, వెస్టిండీస్, మారిషస్, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు. లవంగాల వల్ల పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి.

clove

లవంగాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రపడతాయి. గ్యాస్, ఎసిడిటీ, వికారం, అజీర్ణం తగ్గుతుంది. మలబద్దకం పోతుంది. -లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి అనేక రకాల సూక్ష్మక్రిముల నుంచి, ఇన్‌ఫెక్షన్‌ల నుంచి

మనల్ని రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
* లవంగాలను రోజూ తింటే క్యాన్సర్ బారినుంచి తప్పించుకోవచ్చునని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లవంగాల్లో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
-* లవంగాలను రోజూ తినడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుద్ధి చేస్తాయి. మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.
-* మధుమేహంతో బాధపడేవారు రోజూ ఆహారంలో లవంగాన్ని చేర్చుకోవాలి. లవంగాల్లో ఉండే ఇన్సులిన్ వంటి గుణాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

* -లవంగాల్లో యుజెనాల్, ప్లేవోన్స్, ఐసో ప్లేవోన్స్, ఫ్లేవనాయిడ్స్‌లు ఎముకలను రక్షిస్తాయి. దీంతో వయస్సు మీద పడటం కారణంఆ వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారిపోవడం)ను తగ్గిస్తాయి. -* లవంగాల్లోని యాంటీ ఇన్‌ప్లామేటరీ గుణాలు ఎక్కువ. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. శరీరంలో నీరు ఎక్కువగా చేరకుండా చూస్తాయి. లవంగాలను తినడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారతాయి. నోటి దుర్వాసన పోతుంది. లవంగాలను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
-* లవంగాలను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అజీర్తి, తల తిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి తగ్గుముఖం పడతాయి.

* -పెద్ద పేగులోని పరాన్నజీవిల్ని, సూక్ష్మజీవుల్ని లవంగంలోని యుజెనాల్ నాశనం చేస్తుంది. డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకు లవంగం మంచి మందు.
-* రెండు మూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటి నీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది. జలుబుతో బాధపడేవారు కర్ఛీఫ్ మీద రెండుమూడు చుక్కల లవంగ నూనెను చల్లి వాసన పీల్చాలి. వెంటనే తగ్గుతుంది.

-* కొన్ని లవంగాలను కొద్ది నీళ్లలో మరిగించి దాని నుంచి వచ్చే ఆవిరిని పీలిస్తే ముక్కుకి ఉపశమనం కలుగుతుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి హాని కలిగించే ప్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోపాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్థ్రైటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయి.
-* లవంగాలను నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి మంచివంటున్నారు నిపుణులు.
* -ఎక్కువ దాహం వేసినప్పుడు లవంగాలు తింటే దప్పిక తీరుతుంది. లవంగాలు తెల్ల రక్తకణాలను పెంపొదిస్తుంది. వ్యాధినిరోధక శక్తిగా ఉపయోగపడుతుంది.
* లవంగాలను చందనంతోపాటు రుబ్బి లేపనంగా చర్మానికి పూస్తే చర్మవ్యాధులు మాయమవుతాయి.
* -లవంగ నూనె, నీటితో కలిపిన మిశ్రమం రూం ఫ్రెషర్‌గా పనిచేస్తుంది. కిచెన్‌లోని ఈగల సమస్య ఉంటే ఒక గిన్నె నిండా లవంగాలు తీసుకుని గది మధ్యలో ఉంచాలి.
* -చీమల సమస్య ఉటే దాల్చిన చెక్క, లవంగాల పొడి మిశ్రమాన్ని నీటిలో కలిపి స్ప్రే చేస్తే సమస్య తీరుతుంది.