Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అతి వెలుగు- అనారోగ్యం పెరుగు

Full-light

రాత్రిళ్లు, గాడ్జెట్లు, లాంప్‌ల కృత్రిమ వెలుగు అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఎంత వెలుగో అని సంబరపడుతుంటారు.కానీ అంత ఎక్కువ వెలుగువల్ల అనారోగ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ సమర్థిస్తోంది. ప్రపంచమంతా కృత్రిమ వెలుగుల జిలుగులతోనే తళతళ మంటోంది. నిత్యజీవితంలో ఈ వెలుగులు లేని బతుకు లేదు. వీధి దీపాల నుంచి టివి స్క్రీన్ల వరకు కృత్రిమ వెలుగులే విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి వెలుగువల్ల వచ్చే అనారోగ్య సమస్యలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని వేళలా ఈ లైట్లను వెలిగిస్తూ ఆనందిస్తే పర్యవసానం ఏమిటో తెలిసాక బాధపడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్థూలకాయం, మధుమేహం, కేన్సర్ వంటి రోగాలు సంక్రమించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ కేన్సర్ ఎపిడిమియా లజిస్టులు ఈ సందర్భంగా ఈ అంశాన్ని వివరిస్తూ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వంటి పెద్ద ఆరోగ్య విభాగాలు ఇది పర్యావరణ అంశమని, దీని ప్రభావం సమాజారోగ్యంపై విపరీత పరిణామానికి దారితీసాయని పేర్కొనడాన్ని వివరించారు. ఈ కృత్రిమ వెలుగులు రాత్రంతా కొనసాగుతుంటే రొమ్ము కేన్సర్ తీవ్ర మవుతుందని సూచించారు. పారిశ్రామిక లోకంలోఇది తీవ్ర సమస్యగా మారుతోందని, మన శరీరతత్తాన్ని కూడా మార్చి వేస్తుందని,హార్మోన్లపై విపరీత ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఎలుకలపై ఈ మేరకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయగా వాటిలో కేన్సర్ ప్రబలడం గమనించారు. నైట్‌డ్యూటీ చేసేవారికి కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఉదహరిస్తున్నారు.

Comments

comments