Home వనపర్తి ప్రాజెక్టులను అడ్డుకుంటే.. పుట్టగతులుండవ్

ప్రాజెక్టులను అడ్డుకుంటే.. పుట్టగతులుండవ్

భీమా,నెట్టెంపాడు, కెఎల్‌ఐ ద్వారా ఉమ్మడి జిల్లాల్లో  700 చెరువులకు సాగునీరందించాం

కెఎల్‌ఐ నీటి సామర్థాన్ని 25 నుండి 40 టిఎంసిలకు పెంచాం

మూడో విడత మిషన్‌కాకతీయ పనులు ప్రారంభిస్తున్నాం

బ్రాంచ్ కెనాల్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు

Harish-Rao1

వనపర్తి ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ,బిజెపి, టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నారని వారికి భవిష్యత్తులో పుట్టగతులు ఉండబోవని రాష్ట్ర బారీ నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం ఖిల్లా ఘనపురం మండలంలో రూ. 102 కోట్ల వ్యయంతో మామిడి మాడ మిషన్‌కాకతీయ పనులను స్థానిక ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి, మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపి జితేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలోని పలువురు ఎంఎల్‌ఎల తో కలిసి హరీష్‌రావు ప్రారంభించి ఘనపురం బ్రాంచ్ కెనాల్ పనులకు శంఖుస్థాపన చేశారు.

అనంతరం మండల కేంద్రంలో రైతుల ను ఉద్దేశించి మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భీమా, నెట్టెంపాడు,కెఎల్‌ఐ ద్వారా 700 చెరు వులను నింపి ప్రత్యక్షంగా ,పరోక్షంగా కొన్ని లక్షల ఎకరాల కు సాగునీరు , గ్రామాలకు త్రాగునీరు అందించామని ఆయ న తెలిపారు. గత ప్రభుత్వాలు అనాలోచిత చర్యవల్ల కెఎల్‌ఐ ప్రాజెక్టుకు కేవలం 4 టిఎంసిల నీరు మాత్రమే కెటాయిం చిందని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి నీటి సామర్థాన్ని 25 నుండి 40 టిఎంసిలకు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నే మొట్ట మొదటి సారిగా మూడవ విడత మిషన్ కాకతీయ పనులను వనపర్తి జిల్లాలోని ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది నాటికి ఖిల్లాఘనపురం బ్రాం చ్ కెనాల్ ద్వారా ఘనపురం, భూత్పూర్, పెద్దమందడి, మండ లాలకు 25 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూర్ జిల్లాలో రూ. 900 కోట్లు ఖర్చు చేసి 4 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కెఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా 15 రిజర్వాయర్‌లను నిర్మించేందుకు సిఎం కెసిఆర్ రూ. 3.50 కోట్లను సర్వే కోసం కెటాయించడం జరిగిం దన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అదికారంలోకి వస్తే విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని కాంగ్రెస్ నేతలు కల్లబొల్లి మాటలు చెప్పారని కెసిఆర్ పని తీరు వల్ల రైతులకు 9గంటల కరెంట్‌ను గృహాలకు 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.

కల్వకుర్తి పనులను విస్మరించిన
గత మంత్రులు డికె అరుణ, చిన్నారెడ్డిలు…
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ..

గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంత్రులుగా పని చేసిన డికె అరుణ, ప్రస్తుత ఎంఎల్‌ఎ చిన్నారెడ్డిలు ఏనాడైనా కల్వకుర్తి లిప్ట్‌ఇరిగేషన్ పనులను పరిశీలించారా అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్ర శ్నించారు. రా్రష్ట్రంలోని 31 జిల్లాల్లో ప్రతి ఎకరాకు సాగునీ రందించే గొప్ప బాధ్యతతో సిఎం కెసిఆర్ , హరీష్‌రావులు కృషి చేస్తున్నారని కెఎల్‌ఐ కింద 20 రిజర్వాయర్‌లను నిర్మిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీర్ఘకాలిక ప్రయో జనాల కోసం తాను రాత్రింబవళ్లు శ్రమిస్తున్నానని 2019 ఎన్నికల కంటే ముందే నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

గత పాలకుల నిర్లక్షం వల్లే

ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

మంత్రి లక్ష్మారెడ్డి

గత పాలకుల నిర్లక్షం వల్లే తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిర్లక్షానికి గురయ్యాయని ఉద్యమ నేత కెసిఆర్ నాయకత్వంలో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులకు నిధులు కెటాయించి పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేస్తున్నామని పాలమూర్ ఎత్తిపోతల పథకం ద్వారాఉమ్మడి పాలమూర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. అంతకు ముందు ఎంపి జితేందర్‌రెడ్డి ఎంఎల్‌ఎలు మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రె డ్డి, మాజీ ఎంపి మందా జగన్నాథం తదితరులు ప్రసంగించా రు.

అనంతరం కర్నె తాండాలో 33/11 సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు.  సోలీపూర్ గ్రామంలో పశు వైద్యశాల భవనాన్ని, జిల్లా పరిషత్ పాఠశాల అదనపు తరగతులను ,ఉప్పరిపల్లిలో 33/ 11 కెవి సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన అనంతరం వనపర్తి మండ లం చిమనగుంట పల్లిలో మరో 33/11 కెవి సబ్‌స్టేషన్ నిర్మా ణానికి శంకుస్థాపన చేసిన అనంతరం పెబ్బేరు మండల కేం ద్రంలోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన గోదా ములను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ భద్ర య్య, జెసి నిరంజన్, డిఆర్‌ఓ చంద్రమోహన్, టిఆర్‌ఎస్‌ఉ మ్మడి జిల్లా అధ్యక్షులు బాద్మి శివకుమార్, టిఆర్‌ఎస్ నాయ కులు మేఘారెడ్డి, రమేష్‌గౌడ్, శంకర్ నాయక్, కృష్ణానాయక్, ఎత్తం రవి , వేణుగోపాలకృష్ణ, పురుషోత్తం రెడ్డి, యోగా నంద్ రెడ్డి, వివిధ మండలాల టిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఎంపిపిలు , జడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.