Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సమస్యల వలయం.. తహసిల్ధార్ కార్యాలయం

స్థానికంగా ఉండని సిబ్బంది

పత్తాలేని ఇంచార్జి తహసిల్దార్

కనిపించని ఉన్నతాధికారుల తనిఖీలు

MRO-Office

కుభీర్: మండల కేంద్రమైన కుభీ ర్‌లో గలత హసిల్దార్ కార్యాలయం సమ స్యల వలయంలో చిక్కుకుపోయింది. మండలానికి మెజిస్ట్రే ట్‌గా ఉండే తహసిల్దార్ కార్యాలయంలో ఏ ఒక్క అధికారి సక్రమం గా విధులు నిర్వ హించ డం లేదనే ఆరోపణలున్నా యి. డిప్యూటీ తహసి ల్దార్ తో పాటు మిగితా సి బ్బంది ఒక్కరు కూడా స్థా నికంగా ఉండకుం డా వారి వారి పట్టణాల నుం డే రాక పోకలు సాగిస్తూ, సమయ పాలన పా టించ డం లేదని, పలువురు అంటున్నారు. ఉవ యం 11 గంటలకు వచ్చి, మద్మా హ్నం 3 గంటలకే తిరిగి వెళ్లి పోతున్నారని, ఏ ఒక్క అధికారి కూడా విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, పలువురు విమర్శిస్తున్నారు. దీనికి తోడు ఇంచార్జ్ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చందర్ సైతం కార్యాలయానికి సక్రమంగా రాక పోవ డంతో పనుల నిమిత్తం కార్యాలయానికి వ చ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

స్థానికంగా ఉండి, విధులు నిర్వహించాల్సిన విఆర్‌వోలు స్థానికంగా ఉండకుండా పట్టణం నుంచే రాక పోకలు సాగిస్తూ ఇష్టా రీతిలో విధులు నిర్వహిస్తున్నారని, పలువురు అంటున్నారు. ఒకరిద్దరు తప్ప మిగితా విఆర్‌వోలు ఒక్కరు కూడా స్థానికంగా ఉండరు. వారి వారి గ్రామాల నుంచే రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వ హిస్తున్నారు. విఆర్‌వో ఎక్కడ ఉంటాడో తెలియక సంబం ధిత గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, విఆర్‌వోలు స్థానికంగా ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలు కోరుతున్నారు.

పనుల నిమిత్తం, పలు దృవీకరణ పత్రాల కోసం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల పనులు ఆలస్యం అవుతు న్నాయని, పలువురు అంటున్నారు. దాదాపు 2 రోజుల్లో పూర్తయ్యే పనికి వారం రోజులకు పైగా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని, పలువురు అంటున్నారు. కార్యా లయంలో ఒక అధికారి ఉంటే, ఇంకో అధికారి ఉండక పోవడంతో పనులు ఆలస్యం అవు తున్నాయని, పలువురు అంటున్నారు. అధికారులందరూ అందుబాటులో ఉంటే ప్ర జలకు సౌకర్యంగా ఉంటుందని, ఉన్నతాధికారులు స్పందిం చి, రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకో వాలని, ప్రజలు కోరుతున్నారు. అలాగే మండలానికి రెగ్యు లర్ తహసిల్దార్ ను సైతం నియమించాలని కోరుతున్నారు.

కనిపించని ఉన్నతాధికారుల తనిఖీలు రాష్ట్ర ప్రభుత్వం ప్ర జల సౌకర్యార్థం జిల్లాల పున ర్వి భజన చేసి, ప్రజలకు అందు బాటులో ఉండేలా జిల్లా కేంద్రా లను, డివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయినా ప్రజలకు  మెరుగైన పాలన కరువైంది. దీనికి నిధర్శనం అస్తవ్యస్తంగా మారిన కుభీర్ తహసిల్దార్ కార్యాలయమే. అధికారులు స్థానికంగా ఉండి, విధులు నిర్వహిం చాల్సి ఉండ గా ఏ ఒక్క అధికారి స్థానికంగా ఉండక పోయిన ఈ విషయం ఉన్నతాధి కారులకు ఫిర్యాదులు చేసిన ఏ ఒక్క అధికారి స్పందించి, తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేయడం లేదని, పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధి కారులు స్పందించి, తహసిల్దార్ కార్యాలయాన్ని గాఢీన పెట్టాలని, మండల ప్రజలు మరి మరీ కోరుతున్నారు. ఈ విషయమై తహసిల్దార్, డిప్యూటి తహసిల్దార్‌లకు ఫోన్ చేయగా సర్వీసు నిలిపివేయడం జరిగిందని వచ్చింది.

Comments

comments