Home జాతీయ వార్తలు మోడీ, మమత వల్ల బెంగాల్‌కు చేటు: సోనియా

మోడీ, మమత వల్ల బెంగాల్‌కు చేటు: సోనియా

sonia-gandhiకేనింగ్ ( పశ్చిమ బెంగాల్) : ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజాస్వామ్యానికి ప్రమాద కారులని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఒక ఎన్నికల ర్యాలీలో  విమర్శించారు. వారు అవని పనులకు పూర్వ ప్రభుత్వాలను నిందిస్తారని వ్యాఖ్యానించారు. వారు దేశ  భిన్నత్వానికి కూడా ప్రమాదకారులను పేర్కొన్నారు. మమత, మోడీ మధ్య కత్తు బెంగాల్‌కు ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆమె హెచ్చ్రరించారు. వారు గర్విష్టులని, మెడీ పాలన తీరు మన దేశ మౌలిక తత్వాలైన సెక్యులరిజం, భిన్నత్వాలకు చేటు తెచ్చే విధంగా ఉందని పోనియా విమర్శించారు.బెంగాల్  ప్రజలకు  మమత పాలన ఆశలు రేకెత్తించి వమ్ము చేసిందని, దేశ ప్రజలను కూడా ఆమె భంగపరచిందని సోనియా తూర్పారబట్టారు. తప్పుడు ఆశలు మమత కల్పించారని చెప్పారు. అయిదేళ్లక్రితం ఆశలు రేకెత్తించి ఓట్లడిగిన మమత ఇప్పుడు భయపెట్టి ఓట్లు గుంజుకోజూస్తున్నారని వివరించారు. గత 60  ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని, తాయు గత రెండేళ్ల పాలనలో అన్నీ సాధించిమని మోడీ చెప్పేవి వట్టి ప్రగల్భాలని యద్దేవా చేశారు. కాంగ్రెస్ రాజ్యాంగ సంస్థలను సృష్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసినట్లు సోనియా వివరించారు.