Home కామారెడ్డి కల్యాణలక్ష్మీలో అవకతవకలు

కల్యాణలక్ష్మీలో అవకతవకలు

kalyana-Laxmi_-manatelangan

కామారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల ఎంపికలో అవతవకలకు పాల్పడిన అధికా రులపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా.ఎన్.సత్యనారాయణ కొరఢా ఝుళిపించా రు. ఇందుకు బాధ్యులైన లింగంపేట తహసీల్దార్ కోదండరామిరెడ్డిని బదిలీ చే యగా, నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు వ్యవసాయ శాఖాధికారి సాయి రమేశ్‌కు మెమో జారీ చే శారు. మొదటి కేసులో లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మంగళి కవితకు రెండో పెళ్లి జరిగినప్పటికీ మొదటి పెళ్లిగా చూపించి తప్పుడు సమాచారం అందజేసి కల్యాణలక్ష్మి పథకం కింద ఎంపిక చేశారు.

ఈ కేసులో అదే గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి కిషన్‌రావు, విఆర్‌ఒ ధ ర్మయ్యను బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తుర్వు లు వెలువరిం చారు. ఇదే కేసులో వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సాయిరమేశ్‌కు ఎలాంటి సంబంధం లేనప్పటికీ మొదటి పెళ్లిగా ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసినందు కు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.

మరో కేసులో లింగంపేట మండలం శెట్పల్లి తండాకు చెందిన దేవసోత్ శోభ గత 2012లో పెళ్లి జరగగా 2016లో పెళ్లి జరిగినట్లు ధ్రువీ కరించినందుకు విఆర్‌ఒ సునీత, ఇన్‌చార్జి గిర్దావర్ సత్యనారాయణలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు కేసులకు బాధ్యులు చేస్తూ లింగంపేట తహసీల్దార్ కోదండరామిరెడ్డిని విధుల నుంచి తప్పించి బది లీ చేస్తూ అతనిపై చర్యలకు సిసిఎల్‌ఎకు సిఫార్సు చేశారు. కాగా లింగంపేట తహసీల్దార్ స్థానంలో డిప్యూటీ తహసీల్దార్ గంగాధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.