Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రుచులు పండించిన రోళ్ళు, రోకళ్ళు

Rolu-Rokalu

ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినప్పటికీ రోలు, రోకలి, పొత్రం, రుబ్బురోలు, విసుర్రాయి దర్శనమిచ్చేవి. సాంకేతిక వస్తువులు అందుబాటులోనికి రావడంతో అవి కనుమరుగై పోతున్నాయి.

రోలు – రోకలి – పొత్రం : సాధారణంగా ప్రతీ ఇంట్లో ఉండే వస్తువుల్లో రోలు, రోకలిది ప్రధాన పాత్ర. పచ్చళ్లు, కారపుపొళ్లు, కొద్దిపాటి కూరలకు మషాలాలు, మరో ప్రక్క ఇంట్లో ఆడ పిల్లలు అలంకరించుకునేందుకు గోరింటాకు నూరుకునేందుకు రోలు, రోకలిని విరివిగా వాడుతుండేవారు. నిత్య జీవితంలో వీటి పాత్ర తప్పని సరిగా ఉండేది. మరీ పెద్ద రోళ్లలో అయితే పూర్వ కాలం ఇద్దరు ముగ్గురు మహిళలు కలిసి మిరపకాయలు దంపి కారం కొట్టే వారు. ఇంకో ప్రక్క నట్టింట్లో నేల రోళ్లు ఉండేవి. వీటినిలో ఒడ్లు దంపేవారు. ఇలా తయారైన బియ్యాన్ని తిన్న రోజుల్లో ఎలాంటి రోగాలు లేవు.

విసుర్రాయి, నునుపు రాయి : ఆ రోజుల్లో గృహాల్లో విసుర్రాయిది ప్రధాన పాత్ర. కందులు, పెసలు, జొన్నలు, మొక్క జొన్నలను విసుర్రాయిలో పోస్తుండేవారు. పై రాయి తిరుగుతుంటూ క్రిందిరాయిపై పడిన ఆయా వస్తువులు ముక్కలుగా మారుతుంటాయి. జొన్నలు, మొక్కజొన్నలను విసుర్రాయిలో వేసి ఆడిస్తేగాని వంటకు ఉపయోగపడేవి కావు. కొన్ని ప్రాంతాల్లో ఊరిలోని ఓ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లతో తయారు చేసిన రోళ్లు ఉండేవి.

Comments

comments