Search
Friday 21 September 2018
  • :
  • :

అమిత్ షా హెలిప్యాడ్ కోసం ట్రక్కుల కొద్దీ నీటి వృథా

AMITSHAHచండీగఢ్: తాగటానికి కనీసం చుక్క నీరు కూడా దొరక్క ఓ పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు మంత్రులు, రాజకీయ నాయకుల హెలిప్యాడ్‌ల కోసం వేల లీటర్లు నీటిని వృథా చేస్తున్నారు. తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో దుమ్ము రాకుండా ఉండేందుకు హెలిప్యాడ్‌ను కొన్ని వందల లీటర్ల నీటితో తడిపారు. శనివారం అమిత్ షా హర్యానా రాష్ట్రంలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన హెలికాప్టర్ దించేందుకు గోహన ప్రాంతం నుంచి ఆరు ట్రక్కుల నీటిని కొనుగోలు చేశారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కరవు పీడిత ప్రాంతం భివండీలో పర్యటించే సమయంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసేందుకు పది వేల లీటర్ల నీటిని ఉపయోగించిన విషయం తెలిసిందే.  ఈ ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం యుపి, హరియాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలేశ్‌యాదవ్, మనోహర్‌లాల్ ఖట్టర్ హెలిప్యాడ్‌ల కోసం నీటిని వృథా చేశారు.

Comments

comments