Search
Sunday 23 September 2018
  • :
  • :

ఛాలెంజింగ్ పాత్రలో శోభిత

Sobhita Dhulipala Act in Goodachari movie

మాజీ మిస్ ఇండియా అయిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ మొదట హిందీ సినిమాతోనే తెరంగేట్రం చేసింది. ఇటీవల ‘గూఢచారి’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సినిమా సూపర్ హిట్ కావడం, శోభిత పాత్ర కూడా ప్రాధాన్యం ఉన్నది కావడంతో తనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఈ తెనాలి బ్యూటీ ఫ్యాషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి లిప్‌లాక్‌లు, బోల్డ్ అవతారంలో కనిపించేందుకు పెద్దగా అభ్యంతరాలు చెప్పడం లేదు. ప్రస్తుతం శోభిత ‘మూతోన్’ అనే ఒక మలయాళం, హిందీ బైలింగ్వల్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళం యంగ్ స్టార్ నివిన్ పౌలి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ బ్యూటీ సెక్స్‌వర్కర్ పాత్రలో కనిపిస్తుందట. ఈ పాత్ర పోషించడమంటే శోభితకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి ఈ పాత్రతో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది చూడాలి.

Comments

comments