Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కుటుంబ కలహాలతో ఐశ్వర్యరాయ్ ఆత్మహత్య చేసుకుందటా..!?

Aishwarya-Raiముంబయి : ‘బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆత్మహత్యకు పాల్పడింది.’ ఇది ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త. సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయాక.. వదంతులు, రూమర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరైనా ఒక సెలబ్రిటీ గురించి ఏదైనా వార్త తెలిస్తే.. దాన్ని వక్రీకరించి తమదైన శైలీలో సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోషల్‌మీడియా రూమర్లకు ఐశ్వర్య బలైంది.

ఐశ్వర్య తాజాగా రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంతో ఆమె రణ్‌బీర్‌తో చేసిన రొమన్స్ సీన్లు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ సీన్లు కారణంగా ఆమె కుటుంబంలో కలతలు రేగాయని. వాటి కారణంగా ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిందని కథ అల్లారు.

ఐశ్వర్య ఆత్మహత్యయత్నం చేయడంలో బచ్చన్ కుటుంబం డాక్టర్‌ను పిలిపించిందని, కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోదని విస్తృతంగా ప్రచారమైంది. ఆదివారం ఆర్థరాత్రి ఓ పార్టీలో సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రతో కలిసి ఐశ్వర్య కనబడడంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది.

Comments

comments