Search
Thursday 15 November 2018
  • :
  • :

ఇవాంకా భద్రతలో ‘సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ సెంటర్’

                Media

మన తెలంగాణ/సిటీబ్యూరో:ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఇఎస్)లో పాల్గొనేందుకు నగర పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌కు భద్రతలో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా సైబరాబాద్ పోలీసులు ‘సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ సెంటర్’ను ఉపయోగిస్తున్నారు. ఈ సెంటర్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఉంది. ఇక్కడ ప్రత్యేక ఐటి నిపుణులను నియమించారు. ఇవాంకాపై వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సందేశాలను పంపుకుంటే సోసల్ మీడియా మేనేజ్‌మెంజ్ సెంటర్‌లో ఉన్న సిబ్బంది పసిగడతారు.

ఇవాంకాకు వ్యతిరేకంగా పంపేవారి ప్రతి వ్యక్తికి సంబంధించిన వివరాలను వారు క్షణాల్లో రాబడుతారు. ఉదాహరణకు సోషల్ మీడియా ద్వారా “ఇవాంకను అడ్డుకోవాలని” లేదా “ఆమె కాన్వాయ్‌ను గుర్తించాలని” “ఆమె ప్రయాణించే రూట్స్ విషయంలో ఆరా తీయడం” ఇలాంటి సందేశాలపై ఈ సెంటర్ ద్వారా నిఘా పెడతారు. ఎవరైనా ఆమెకు వ్యతిరేకంగా టార్గెట్ చేసి సందేశాలు పంపిస్తే వారి వివరాలను తెలుసుకుని ప్రమాదాన్ని అరికడతారు. ఇవాంకా భద్రత విషయంలో ఈ సెంటర్‌ను ఉపయోగిస్తున్న విషయంపై ఉన్నతాధికారులు మాత్రం నోరు మొదపడంలేదు. అయితే ఇప్పటికే ఈ సెంటర్‌లో ఐటి నిపుణులతో పాటు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించారు. వీరు ఇవాంకా హైదరాబాద్ నుంచి తిరిగి అమెరికా వెళ్లేవరకు విధుల్లో ఉంటారు. కావున ఎవరైనా ఇవాంకాపై వ్యతిరేకంగా తమాషాకైనా సందేశాలు పంపితే చిక్కుల్లో ఇరుక్కుంటారు తస్మాత్ జాగ్రత్త.

Comments

comments