Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అక్కడ ఫేస్‌బుక్, ట్వీట్టర్, యూట్యూబ్‌లు బ్లాక్..!?

Facebook-and-twitterఅంకారా: సైనిక తిరుగుబాటు నేపథ్యంలో టర్కీ ప్రభుత్వం సోషల్ మీడియాను పూర్తిగా కట్టడి చేసింది. సామాజిక మాద్యమాలైన ఫేస్‌బుక్, ట్వీట్టర్, యూట్యూబ్‌లను నిషేధించింది. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ మూడు సైట్లను టర్కీ ప్రభుత్వం బ్లాక్ చేసిందని, ఆ తర్వాత మరో గంటన్నర తర్వాత తిరిగి అన్ బ్లాక్ చేసిందని చెబుతోంది. కాగా, ఈ సంస్థలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. టర్కీలో సైన్యం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక దేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లుగా కూడా ప్రకటించింది. దేశంలో నియంతృత్వ పాలన, ఉగ్రవాదం కారణంగానే ఈ తిరుగుబాటు చేసినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. తిరుగుబాటులో భాగంగా దేశ రాజధాని అంకారా గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో సైన్యం పహారా కాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ టివి, రేడియోను టర్కీ సైన్యం తన అధీనంలోకి తీసుకొని ఈ ఘర్షణలు మరింత వ్యాపించకుండా ఉండేందుకే సోషల్ మీడియాను కట్టడి చేసినట్లు తెలుస్తోంది. కాగా, టర్కీలో సైనికుల తిరుగుబాటు కారణంగా ఇప్పటి వరకు సైన్యంతో సహా 90 మంది చనిపోయారు.

Comments

comments