Search
Wednesday 26 September 2018
  • :
  • :

క్రిష్‌తో సోషియో ఫాంటసీ మూవీ?

venkyతాజాగా చేసిన ‘గురు’ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు వెంకటేష్. బాలీవుడ్ హిట్ మూవీ ‘సాలా ఖడూస్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నెల క్రితమే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న ఈ సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయాలనుకున్న నెక్స్ మూవీని వెంకటేష్  రద్దు చేసుకున్నట్లు తెలిసింది. క్రిష్ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని చేయాలని అతను భావిస్తున్నాడట. ఈ సోషియో ఫాంటసీ మూవీపై వెంకటేష్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. గతంలో అతను ఈ జోనర్‌లో ‘దేవీపుత్రుడు’ సినిమా చేశాడు. ‘కంచె’ వంటి హిట్ మూవీ తర్వాత ప్రస్తుతం బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని చేస్తున్నాడు క్రిష్. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ బిగ్ స్టార్స్ క్రిష్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు.  ఇటీవల క్రిష్… వెంకటేష్‌కు సోషియో ఫాంటసీ కథ వినిపించాడు. భారీ బడ్జెట్‌తో కూడిన ఈ ప్రాజెక్ట్‌పై వెంకటేష్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఈ చిత్రం త్వరలో తెరకెక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Comments

comments