Home మెదక్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చికిత్సాలయం

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చికిత్సాలయం

Building

మెదక్ ప్రతినిధి: ఉమ్మడి జిల్లాలో ఎక్కడాలేని విధంగా 1987వ సంవత్సరంలో జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం ద్వారా హవేళిఘనపూర్ మండలంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కరణం రామచంద్రారావు మెదక్ నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న సమయంలో ఎన్. శ్రీనివాస్‌రెడ్డి అప్పటి రెవెన్యూ శాఖ మాత్యులు హయాంలో కుష్టురోగులకు ప్రత్యేకంగా తాత్కలిక చికి త్సాలయ భవనాన్ని నిర్మించారు. కానీ అది నేడు పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది.

పట్టించుకునే వారులేక పూర్తిగా శిథిలా వస్తకు చేరింది. ఈ భవన నిర్మాణం చేపట్టి ప్రారంభమయ్యాక సుమారు 20 సంవత్సరాల వరకు ఇక్కడికి వచ్చే కుష్టురోగులకు చికిత్సలు చేసే వారు. కానీ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ వైద్యాన్ని అందించే వారు లేక పూర్తిగా మూతపడి శిథిలావస్తకు చేరుకుంది. అప్పటి నుంచి ఈ భవ నం పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయింది. అంతే కాకుండ సంఘ విద్రోహశక్తులందరూ కూడా ఈ భవనాన్ని వాడు కుంటున్నట్లు హవేళిఘనపూర్ వాస్తవ్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం క్షయ, కుష్టు వ్యాధులకు జిల్లాలో వైద్యం అందించే సదుపాయాలు లేక నేటికి జిల్లా ఏర్పడిన తర్వాత కూడా పక్కజిల్లా సంగారెడ్డికే రోగులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లా కేంద్రమైనందున ఇక్కడే మళ్లీ ఈ రోగులకు వైద్యం అందించేందుకు భవనాన్ని పునరుద్దరించాలని, అం దువల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేసుకునే వ్యాధిగ్రస్తులకు సౌక ర్యవంతంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం శిథిలావ స్తకు చేరిన భవనం పూర్తిగా అన్యక్రాంతమై భవనం వెనుకాలే గల సుమా రు ఆరేడు ఎకరాల భూమి కూడా కబ్జాలకు గురవుతుందని తెలుపుతు న్నారు. భవనం లోపల వెళ్లి చూస్తే పూర్తిగా చెత్తచెదారంతో నిండి ఉండి, ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లా కేంద్రానికి అనువుగా భవనాన్ని పునరుద్దరించి అన్ని వసతులు మునపటి లాగే కల్పించి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతానికి అద్దె భవనాలలో ప్రభుత్వ కార్యాలయాలు నడి పిస్తున్న తరుణంలో వృధాగా ఉన్న ఈ యొక్క భవనాన్ని మునుపటిలాగే కుష్టు వ్యాధి కేంద్రంగా గానీ లేదా ఇతర ఏ ప్రభుత్వ కార్యాలయానికి గా నీ వాడుకోవాలని, అందుకు అనువుగా ఉన్న సువిశాలమైన ఈ భవ నాన్ని ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వాడుకోవాల్సిందిగా హవేళిఘన పూర్ ప్రజలు కోరుతున్నారు. సువిశాలంగా ఉన్న గదులతో నిర్మించిన ఈ భవ నాన్ని ఇప్పటికైనా ప్రభుత్వ పట్టించుకోకపోతే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశముందంటున్నారు. జిల్లా కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భవనాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం చోచనీయ మని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ భవనంలో ప్రభుత్వ సంబంధ మైన కార్యాలయంగా తీర్చిదిద్దితే జిల్లా ప్రజలకు కూడా అందుబాటులో ఉండి సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు.

ఇప్పటికే ఈ భవనాన్ని ఆర్టివో(రోడ్డు ట్రాన్స్‌పోర్టు) అధికా రులు తమకు స్వంత భవనం లేనందునా ఈ భవనాన్ని కేటాయించాలని పలుమార్లు కలెక్టర్‌కు, స్థానిక ఎంఎల్‌ఏ, డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఊరికి రెండు కిలోమిటర్ల దూరంలో ఉన్న సువిశాలమైన భవనంలో తమ కార్యాలయాన్ని, వెనుక ఉన్న ఖాళీ స్థలం లో ట్రాయల్న్ (లైసెన్సులు జారీ చేయివారికి పరీక్షలు నిర్వహించేం దుకు) అనువుగా ఉంటుందని ప్రతిపాధనలు పంపారు. కానీ ఇప్పటి వర కు వారికి ఈ భవనాన్ని కేటాయించక పోవండంతో ప్రస్తుతం అద్దె భవ నంలోనే తమ కార్యక్రమాని కొనసాగిస్తున్నారు.

త్వరలోనే భవనాన్ని పునరుద్ధరిస్తాం: డిఎం అండ్ హెచ్‌ఓ

ఈ శిథిలావస్తలో ఉన్న భవనంలో అ సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని, అందుకు చర్యల విష యంలో డిఎం అండ్ హెచ్‌ఓ అమర్ సింగ్‌నాయక్‌ను వివరణ కోరగా భవ నం శిథిలావస్తకు చేరుకున్న విష యం తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఆ భవనాన్ని పునరుద్దరించి అం దులోనే జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయాన్ని నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఆర్‌డిఓ వారు కూడా ఈ భవనాన్ని తమకు కేటా యించాలని కోరగా అందుకు తాము నిరాకరించినట్లు తెలుపుతూ త్వర లోనే భవనాన్ని పునరుద్దరించి తమ జిల్లా కార్యాలయాన్ని అందులో ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరిగిం దని కుష్టువ్యాధి గ్రస్తుల సంఖ్య తగ్గి జిల్లాలో కేవలం 41 మంది రోగులు మాత్ర మే ఉన్నారని, వారికి తమ ఇంటి వద్దే చికిత్సను అందజేస్తున్నట్లు వివరించారు.