Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇంటి చక్కదనానికి  సోఫాల ఎంపిక

sdfasdf* మనం మొదట దాని మీద ఓ పది నిమిషాలు కూర్చుని కూర్చోడానికి అనువుగా ఉందో లేదో చూసుకోవాలి. తలభాగం, చేతుల భాగం రిలాక్స్ అయ్యే విధంగా ఉండాలి. లోపల స్ప్రింగులు గానీ, కలప గానీ గుచ్చుకునేలా ఉంటే అవి నాణ్యత లోపించినవిగా గుర్తించాలి.
* సోఫాలూ మంచాలూ కొనేటప్పుడు ముఖ్యంగా చూసేది అటూ ఇటూ కదులుతున్నప్పుడు కిర్రు చప్పుళ్లు చేస్తుంటాయి. అలాంటి సమస్య లేకుండా వాటిపై కూర్చుని అటూ ఇటూ కదిలి చూడండి.
* బ్యాక్ రెస్ట్… నడుముకు సౌకర్యంగా ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా కుర్చీలకు, సోఫాలకు ఇది సరిగా లేనప్పుడు వెన్ను నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కూర్చున్నప్పుడు శరీరానికి హాయిగా ఉండాలి. అలాగే ఎక్కువగా దిగబడిపోయేలా ఉండే సోఫాలు అంత మంచివి కావు. లేచేటప్పుడు మోకాళ్ళమీద భారం పడుతుంది. వయసు పైబడిన వారైతే లేవలేరు కూడా. కూర్చున్నప్పుడు పది సెంటీమీటర్లకు మించి లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. అతుకులు, నట్లు, మూలలు జాగ్రత్తగా పరిశీలించండి ఒక్కోసారి కార్నలు గోడలకు కొట్టుకున్నట్టు డామేజ్ అయి ఉంటాయి. ఇక సోఫాను ఎలా వాడితే మన్నికగా ఉంచుకోవచ్చో తెలిపే బ్రోచర్ ఒకటి తీసుకోవాలి. మీ సోఫా పాతబడినట్టుంటే కొత్తది కొనే అవసరం లేకుండా దీనికి లెదర్, కాటన్, జెకార్డ్, సిల్క్, వెల్ షెనిల్ మెటీరియల్ తీసుకొని కొత్తగా మార్చుకోవచ్చు.

Comments

comments