Home ఆఫ్ బీట్ ఆన్‌లైన్ పాఠాలకు అలిసన్

ఆన్‌లైన్ పాఠాలకు అలిసన్

ప్రస్తుతం యావత్ ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. దానికి ముఖ్యకారణం ప్రపంచంలోని ప్రతిదేశం ఇతర దేశాలతో  పోటీ పడుతోంది. రోజుకొక సాఫ్ట్‌వేర్‌తో మార్కెట్లోకి కొత్తకొత్త కోర్సులు రావడంతో కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. దానికితోడు కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లాగా పుడుతున్నాయి. భారీ మొత్తంలో ఫీజులు కూడా అలాగే ఉంటున్నాయి. అంతే కాకుండా నేటి  మహిళలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చదువుకోవాలంటే కూడా కొంతమేరకు ఇబ్బందిగానే ఉంటుంది.  దీనికి చెక్ పెట్టడానికి ఇప్పుడు అలిసన్ అనే ఆన్‌లైన్ ఉచిత కోచింగ్ సిస్టమ్ వచ్చింది. ఇంట్లో కూర్చునే కంప్యూటర్ కోర్సుల్నీ, విదేశీ భాషల్ని నేర్చుకోవచ్చు. ప్లంబింగ్, నర్సింగ్ విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయొచ్చు. ఫీజు లేదు అంతా ఉచితమే నమ్మడం లేదా అయితే ఒక్కసారి ‘alison.com’ గురించి తెలుసుకోవాల్సిందే… దాని ఒక్కసారి చూద్దాం….

Online-Courses

అడ్వాన్డ్ లెర్నింగ్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్ ఆన్‌లైన్ సంక్షిప్త రూపమే అలిసన్. దీనిని ఐర్లాండ్‌కి చెందిన మైక్ ఫీరిక్ స్థాపించాడు. ఎంబిఎ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి చేశాడు. తాను చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉండటంతో తనకు ఒక ఆలోచన వచ్చింది. 15 ఏళ్ల కిందట ఇంటర్నెట్ సాయంతో ఉపాధ్యాయుల కొరతను తీర్చవచ్చని అనుకున్నాడు. ఉచితంగా ఆన్‌లైన్ కోర్సుల్ని అందించాలనేది ఫీరిక్ కోరిక. ప్రపంచవ్యాప్తంగా నెట్ ధరలు ఎక్కువగా ఉండటం, దానికి తోడు పర్సనల్ కంప్యూటర్లూ, స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా లేకపోవడంతో తన లక్ష్యాన్ని వాయిదా వేసుకున్నాడు కొన్నాళ్లు. 2005లో తర్వాత నెట్ ధరలు తగ్గి వినియోగం పెరిగింది. వెబ్‌సైట్లకి ప్రకటనలు ద్వారా ఆదాయం రావడంతో మొదలైంది. దాంతో 2007లో ఐర్లాండ్‌లోని గాల్వే కేంద్రంగా అలిసన్‌ను ప్రారంభించాడు.

సర్టిఫికెట్ అందిస్తారు….ఈ కోర్సుల్ని కేవ లం విద్యార్థులకే కాకుండా ఉద్యోగుల్ని సైతం దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. మీకు ఖాళీ సమయంలో ఇష్టమైన వేగంతో ఈ కోర్సుల్ని పూర్తి చేయొచ్చు. ఉన్నత చదువులకు ఉపయోగపడే గణితం, భౌతిక అర్థశాస్త్రం లాంటి కోర్సులు కాకుండా ఉపాధికి సాయపడే కంప్యూటర్ కోర్సులూ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, మాండరిన్‌లాంటి విదేశీ భాష లూ, అకౌంటెన్సీ, వెబ్‌సైట్ రూపకల్పన, ఆహార భద్రత, నర్సింగ్, ప్లంబింగ్ కోర్సుల్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కోర్సుల్ని ఉపాధ్యాయుల కొరత ఉండే ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఐరోపాల్లోనూ దీనికి మంచి గుర్తింపు లభించింది. ఇంతే కాకుండా అమెరికాలోని 17 రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రాల పరిధిలోని ఉద్యోగులూ, విద్యార్థుల నైపుణ్యాల కోసం అలిసన్‌డాట్‌కామ్‌ను ఉపయోగించుకునేలా ఒప్పం దం కూడా కుదుర్చుకున్నారు.

అలిసన్‌ను ఆశ్రయించేవారిలో సగానికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు. వీరు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ ఉచితంగా పొందుతారు కానీ హార్డ్ కాపీ కావాలంటే మాత్రం కొంత సమయం తో పాటు కొంత మొత్తం చెల్లించాలి. ఇంటినుంచి బయటకు వెళ్లలేని వారు కొన్ని దేశాల్లో ముఖ్యం గా పాకిస్తాన్, పశ్చిమాసియా వంటి దేశాల్లో కూడా ఈ కోర్సులో చేరి విభిన్నమైన కోర్సుల్ని పూర్తిచేసారు. ఖతార్‌లోని ఒక ఐటీ సంస్థ సాయంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడే కుర్దిష్ భాషలోకి కొన్ని కోర్సుల్ని జతకల్పింది అలిసన్. మేం వాటిని కల్పిస్తుండటమే మా విజయానికి కారణం. మా పాఠాలతో సాధారణ ఉద్యోగులు ఇంగ్లీష్‌లో మాట్లాడేలా శిక్షణ ఇస్తున్నాం. ఐటీలో మెలకువల్ని నేర్పిస్తున్నం. మొత్తంగా వారి నైపుణ్యాల్ని అభివృద్ధి వైపుకు తీసుకెళ్తున్నాం అని ఫీరిక్ చెబుతుంటాడు. తమ వెబ్‌సైట్‌లో కోర్సులు ఎప్పటికీ ఉచితమే అంటున్నాడు. ఇప్పటికి 12 మిలియన్ల మంది వరకు చదువు కుంటున్నారు. ప్రస్తుతం 1.5 మిలియన్‌కి పైగా డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్ని పొందారు. ఇందులో 1000 కోర్సుల వరకు ఉంటాయి. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మందికి సేవల్ని అందించారు. వీరిలో 1834మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉన్నా రు. ఈ కోర్సుల్లో ప్రతి నెలా రెండు లక్షలమంది కొత్తగా చేరుతుంటారు. ఇప్పటివరకు 195 దేశాల్లో అందుబాటులో ఉంది.

భారత్‌వైపు చూపు…… భారత్‌లో రోజురోజుకి యువత ఐటీ వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దేశంలో ప్రతి రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ఎక్కువగానే స్థాపిస్తున్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో 18 శాతం భారత్‌లోనే ఉంటారు. అందుకే త్వరలో భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల్ని తేవాలనుకుంటోంది అలిసన్. భారత్‌లో నైపుణ్యాల్ని మెరుగు పర్చుకోవడం కంటే కూడా కాలేజీ డిగ్రీలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. ఈ ధోరణిలో మార్పు రావాలంటారు ఫీరిక్. ఇప్పటికే మన దేశం నుంచి అలిసన్‌లో వివిధ కోర్సులు చేసిన వారూ, చేస్తున్నవారి సంఖ్య పదిలక్షలు దాటింది. భారత్‌లో బాగా డిమాండ్ ఉండే స్వచ్ఛంద సంస్థల నిర్వహణకు సంబంధించిన కోర్సుని అగాఖాన్ ఫౌండేషన్ సాయంతో రూపొందించి అందిస్తోంది. ఆల్ ఇండియా సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సాయంతో కొత్త కోర్సుల్ని భారత్ అవసరాలకు తగ్గట్టు తీసుకురానున్నట్టు చెబుతున్నారు. భారత్‌లో పర్యటించిన ఫీరిక్ భారతీయ భాషల్లోనూ కొన్ని కోర్సుల్ని మొదలు పెడతామంటున్నారు. నిద్యోగులకు ఫీజులు కట్టలేని వారు చా లా వరకు మన దేశంలోనే ఉన్నారు అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడే ఆన్‌లైన్ కోర్సు. అయితే మీరు కూడా ఒక సారి దీనిపై దృష్టిపెట్టి విజయం సాధించండి.