ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మెట్రో సమీపంలోని హెచ్ఎండిఎ లేఅవుట్లో గురువారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.