Search
Wednesday 14 November 2018
  • :
  • :

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Software Employee Commits Suicide in Hyderabad

హైదరాబాద్ : పిల్లలు పుట్టడం లేదన్న బాధతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్కాజ్‌గిరికి చెందిన ప్రవీణ్‌కుమార్‌కు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శ్వేత వారణాసి భగవత్(32)తో 2011లో పెళ్లి జరిగింది. వీరు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ జోన్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీరు గచ్చిబౌలి ఐటి జోన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. తనకు పిల్లలు పుట్టడం లేదని కొంతకాలంగా శ్వేత బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని శ్వేత ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం కోసం శ్వేత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments