Home రంగారెడ్డి రాలిపోతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

రాలిపోతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

సమస్యలకు బెదిరిపోయి తనువు చాలిస్తున్న వైనం
వరుస ఆత్మహత్యలలో ఆందోళన చెందుతున్న ఐటి ఉద్యోగులు
ఏడాదికి 50కి పైగా ఘటనలు
తల్లిదండ్రులకు గర్భశోకంతో పాటు

suicide1మన తెలంగాణ/సిటీబ్యూరో:ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయ డంలో విఫలం చెందినందుకు మనస్థాపం చెందిన అమీర్‌పేట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లక్ష్మీగుప్తా (35) ఇటీవల ఆత్మ హత్యకు పాల్పడ్డాడు..భార్య అదనపు కట్నం వేధింపుల కేసు పెట్ట డంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఉప్పల్‌లో ఓ ఐటి కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయ్‌కుమార్ కర్మన్‌ఘాట్‌లోని తన ఇంట్లో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు మోసం చేశాడని, ప్రియురాలు మోసగించదనే సమ స్యలతో కూడా ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. సమస్య ఏదైనా పరిష్కరిం చుకునే ధైర్యం చేయలేక తనవు చాలిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇలా నెల రోజుల వ్యవధిలోనే పదిమందికిపైగా వివిధ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడడం శోచనీయం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరుస ఆత్మహత్యలతో ఆ రంగంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కలత చెందుతున్నారు. ఆర్ధికంగా స్థిరపడిన వీరు ఏదో ఒక చిన్న సమస్యలకే ఇలా తనవు చాలిస్తున్నారు. తోటి వారికి తమ సమస్యను చెప్పుకుంటే ఎక్కడ తమ పరువు పోతుందోనని భయపడి తమ సమస్యను తమలోనే దాచుకుని మదనప డుతున్నారు. అభివృద్ధ్ది చెందిన హైదరాబాద్ నగరంలో వందలాది సాఫ్ట్‌వేర్ కంపెనీలలో లక్షలాధి మంది ఉద్యోగులు పనిచే స్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, బెంగుళూరు, చెన్నై, కెరళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఇక్కడ స్థిరపడి ఐటి కంపెనీలలో ఉద్యో గాలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఏడాదికి సగటున 50 మందికిపైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని రికార్డులు చెబుతున్నాయి. ఈ సృష్టిలో మానవ జన్మ ఓ అద్భుతం. జనన, మరణాలు దైవ నిర్ణయం. సమస్యను మానిసికంగా కుంగి పోకుండా సవా లుగా తీసుకొని పరి ష్కార కోసం మార్గాన్ని అన్వేషించడం ఉత్తముడి లక్షణం. జీవితంలో ప్రతి సమస్యనైనా సునా యసంగా ఎదుర్కొనే ధైర్య వంతు లు కావాలి. ప్రేమ విఫల మైందని కొందరు.. ఆత్మీయత కరవైం దని కొందరు. వ్యాపారుల్లో నష్టాలు వచ్చాయని మరి కొంతమంది.. భార్య-భర్తల మధ్య అన్యోన్నత లేని వారు. .తీవ్ర రోగాలబారిన పడిన వారు.. పరీక్షల్లో తప్పామని విద్యార్థులు.. ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ఏ మా త్రం ఆలోచించినా వీటికి పరిష్కారమార్గాలుం టాయి. కాని అదే చేయడం లేదు.. బల వన్మ రణానికి పాల్పడే వారిలో చివరి నిమి షంలో ఎందుకు చావాలి అనే ప్రశ్న తలెత్తితే మరి ఆ పొరపాటు జరగదని సైకాల జిస్టులు చెబు తున్నారు. ప్రతి సమస్య తలెత్తిన సంద ర్భంలో తీవ్ర భయానికి లోనుకావడం వంటి సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిపుణులు అనుభ వాన్ని వివరిస్తున్నారు. గతంలో వివిధ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉదంతాలు ఇలా ఉన్నాయి.
భర్త వేధింపులు…
డిసెంబర్ 2, 2012 నాడు భర్త వేధింపులు భరించలేక డిలైట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన అనిత (26) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పియుడు దూరమయ్యాడని…
ప్రియుడి తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించడంలేదని నిజాంపేటలో ఉండే కృష్ణమోహన్ కుమార్తె స్వాతి (26) జనవరి 1, 2014నాడు తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంది.
అనారోగ్యంతో బాధపడుతూ…
ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అన్వేష్ (26) అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 2, 2014నాడు మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యాన్ని భరించ లేక చనిపోతున్నానని తన సూసైడ్ నోట్‌లో రాశాడు.
పనిఒత్తిడితో…
ఉద్యోగంలో పనిఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎల్లా రెడ్డిగూడలో నివాసముంటున్న ఎస్.శ్రీధర్ (29) ఫిబ్రవరి 10, 2013నాడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరు నెలల క్రితమే ఇతనికి పెళ్లి అయింది. భార్యను పుట్టింటికి పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పదో అంతస్తు నుంచి దూకి…
ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఓ యువ కుడు ఇన్ఫో సిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్రిల్ 15, 201 6 నాడు తాను నివా సముం టున్న ఘట్‌కేసర్‌లోని సంస్కృతి టౌన్‌షిప్ కాలనీలో పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కోల్‌కతా యువతి…
కోల్‌కతాకు చెందిన సుదేష్ణ దాస్ (36) మాదా పూర్‌లోని ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ నీర్‌గా పనిచేస్తుంది. డిసెంబర్ 16, 2013 రాత్రి ఆమె అయ్యప్పసొసైటీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మానసిక ఒత్తిడితో…
గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న సి.ప్రవీణ్ కుమార్ (24) ఇటీవల కంపెనీ నిర్వహించిన పరీక్షలో ఫెయిల య్యాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్న అతను జనవరి 24, 2014 నాడు తన గదిలో ఉరివే సుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు.
ఇష్టంలేని పెళ్లి చేశారని..
ఇష్టం లేని పెళ్లి చేశారని అఫెక్స్ కంపెనీలో పనిచేస్తున్న కెపిహెచ్‌బికాలనీకి చెందిన భవాని (23) మే 25, 2013న ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సరైన భర్తను ఎంచుకోనందుకు…
భర్తను ఎంచుకోవడంతో తాను విఫలమ య్యానని, ఎనిమిదేళ్లు ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న తనకు సంతృప్తిలేదని సూసైడ్ నోట్ రాసిన మణికొండలో నివాస ముంటున్న ఢిల్లీకి చెందిన కనిక (26) జూన్ 25, 2013లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో….
భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ప్రగతి నగర్‌లో నివాసముంటున్న కృష్ణాజిల్లా కోరుకొల్లుకు చెందిన రాజేష్‌కుమార్ (32) తీవ్ర మనోవేదనకు గురై ఆగస్టు 31, 2013నాడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.రాజేష్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ లో పనిచేస్తున్నాడు.
ఒత్తిడి భరించలేక……
మానసిక ఒత్తిడి భరిం చ లేక దోమల గూడలో నివాసముం టున్న పి.సంధ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంధ్య బెంగ ళూర్‌లోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ నీర్‌గా పనిచే స్తుంది. పని ఒత్తిడి భరిం చలేకనే ఆత్మ హత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వారిని కనిపెట్టడమెలా..?
-ఎక్కువగా ఒంటరితనంగా గడపడానికి ప్రయత్ని స్తుంటారు.
-ఇతరులకు తెలియకుండా బ్లేడు, కత్తెర, తాడు, కిరోసిన్, విషగుళికలు, నిద్రమాత్రలు దాచి ప్రతి సారి గమనిస్తుంటారు.
-సన్నిహితులను సైతం పలు మార్లు ద్వేషిస్తుంటారు.
-బతుకుమీద ఎలాంటి ఆశలు లేనట్లు మాటా డుతుండడాన్ని జాగ్రత్తగా గమనించాలి.
-వారి మానసిక వేదను, వారు తీసుకోబోతున్న నిర్ణయాన్ని నోటు పుస్తకాల్లో, పేజీల్లో రాయడానికి యత్ని స్తారు.
-ప్రతి సమస్యకు చావే పరిష్కా రంలా మాట్లాడ డానికి యత్నిస్తుంటారు.
-తమకు ఎవరూ లేరని ఒంటరి తనాన్ని మాటల్లో బయట పెడుతుంటారు.
-రహస్యాలను, కొన్ని విషయాలను వారి సన్నిహి తులకు సమాచారంలా చెబుతుం టారు. -వారి పిల్లల ఫోటోలు చూస్తూ, వారి పిల్లలను దగ్గరకు తీసుకుని తరచూ ఏడుస్తూ కనిపిస్తారు.
ప్రతి రెండు నిమిషాలకు ఒకరు..
జాతీయ నేర పరిశోధక విభాగ వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 25 సెకన్లకు ఒకరు బలవణ్మరణానికి పాల్పడుతు న్నారు. భారతదేశంలో ప్రతి రెండు నిమిషా లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆత్మహత్యల్లో 39 శాతం మంది భారతీయులే.
ఇటు తల్లిదండ్రులు, అటు భార్య పిల్లలను…..
సమస్యలను పరిష్కరించుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఇటు తల్లిదండ్రులకు గర్భశోకంతో పాటు ఆర్ధిక సమస్యలకు కారణ మవుతున్నారు. మరోవైపు కట్టుకున్న భార్యకు కన్నీళ్లే మిగిలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకో వడం వల్ల మిగతా వాళ్లకు ఇబ్బందులు పెట్టిన వారవు తారే కాని వారికి ఎలాంటి సుఖాలు పెట్టిన వారు కారు. కావున ఆత్మ హత్యలు చేసుకునే వారిని గుర్తించి వారికి మనోధైర్యం కల్పిం చాల్సి న బాధ్యత మనందరిపై ఉంది .వారిని కనిపెట్టడమెలా..?
-ఎక్కువగా ఒంటరితనంగా గడపడా నికి ప్రయత్ని స్తుంటారు.
-ఇతరులకు తెలియకుండా బ్లేడు, కత్తెర, తాడు, కిరోసిన్, విషగుళికలు, నిద్రమాత్రలు దాచి ప్రతిసారి గమని స్తుంటారు. -సన్నిహితులను సైతం పలు మార్లు ద్వేషిస్తుంటారు. -బతుకు మీద ఎలాంటి ఆశలు లేనట్లు మాట్లాడుతుండడాన్ని జాగ్రత్తగా గమనించాలి.
-వారి మానసిక వేదను, వారు తీసుకోబోతున్న నిర్ణయాన్ని నోటు పుస్తకాల్లో, పేజీల్లో రాయడానికి యత్నిస్తారు.
-ప్రతి సమస్యకు చావే పరిష్కారంలా మాట్లాడడానికి యత్నిస్తుంటారు.
-తమకు ఎవరూ లేరని ఒంటరి తనాన్ని మాటల్లో బయట పెడుతుంటారు. -రహస్యాలను, కొన్ని విషయాలను వారి సన్నిహితులకు సమాచారంలా చెబుతుంటారు. -వారి పిల్లల ఫోటోలు చూస్తూ, వారి పిల్లలను దగ్గరకు తీసుకుని తరచూ ఏడుస్తూ కనిపిస్తారు.
ఇటు తల్లిదండ్రులు, అటు భార్య పిల్లలను….
సమస్యలను పరిష్కరించుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఇటు తల్లిదండ్రులకు గర్భశోకంతో పాటు ఆర్ధిక సమస్యలకు కారణమవుతున్నారు. మరోవైపు కట్టుకున్న భార్యకు కన్నీళ్లే మిగిలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల మిగతా వా ళ్లకు ఇబ్బందులు పెట్టిన వారవుతారే కాని వారికి ఎలాంటి సుఖాలు పెట్టిన వారు కారు. కావున ఆత్మహత్యలు చేసు కునే వారిని గుర్తించి వారికి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిని గుర్తించాలి..

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఎవరూ లేని సమయాన్ని గమనిస్తుంటారు. వీరితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నిమార్లు చిన్న చిన్న వివాదాలు ఇతర సమస్యలతో అకస్మా త్తుగా నిర్ణయం తీసుకుంటారు. పక్కనే ఎవరైనా ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పించవచ్చు. ఒకసారి అలాంటి ఆలోచ న వచ్చిందంటే మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లడం మంచిది. వారి మానసిక స్థితిని గుర్తించి మానసిక వేదనకు గురయ్యారా..? లేదా..సున్నిత స్వభావంతో ఇబ్బందికి గురయ్యారా..? ఆలోచించి కౌన్సిలింగ్ ఇప్పించాలి.
-మానసిక వైద్య నిపుణులు

ఆత్మహత్యే పరిష్కారం కాదు..
సమస్యలు లేని జీవి తంలేదు. అవి తాత్కా లికమైనవి. విద్యార్థి, ఉద్యోగి, వ్యాపారి ఎవరి స్థాయిల్లో వారికి ఇబ్బందులు ఉంటాయి. పోరాడి గెలవాలి కాని ఆకస్మాత్తు నిర్ణయా లతో నమ్ముకున్న వారికి శోకం మిగల్చ కూడదు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ఆత్మీ యులు.. సన్నిహితులు..స్నేహితులతో పంచు కోవా లి. ఆత్మహత్యే శరణ్యం అనేవా రిలో ధైర్యాన్ని నింపడానికి మా సంస్థ పనిచే స్తుంది. ఆ ఆలోచన వస్తే 040-66202000, 040-66202001 నంబర్లకు ఫోను చేయవచ్చు. ఆనంద్ దివాకర్
– రోష్ణి సంస్థ ప్రతినిధి

కుటుంబ కలహాల నేపథ్యంలో
కుటుంబ కలహాలతో హైటెక్ సిటీలోని హెచ్ ఎస్‌బిసిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న డి.క్రిష్ణారెడ్డి (45) నవంబర్ 13, 2014లో ప్యారడైజ్‌లోని రాజ్‌కం ఫర్ట్ హోటల్ గదిలో బీరులో పురుగుల మందు కలు పుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రియురాలు దూరమైందని
ప్రియురాలు దూర కావడంతో హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీ ర్‌గా పనిచేస్తున్న ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అత్తాడ ప్రవీణ్‌కుమార్ (30) ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వాలెంటైన్స్ డే నాడే
యాప్రాల్‌లోని సాయికృష్ణ కాలనీలో నివాసం ఉండే మాజీ సైనికుడు టి.సుదర్శన్ కూతురు సుప్రియ (26) మాదాపూర్‌లోని సైబర్ పెరల్‌లోని అసెంబర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఫిబ్రవరి 14 2015 ప్రేమికుల రోజున సుప్రియ తన స్నేహితుడు సాయి కిరణ్‌లు గొడవపడ్డారు. ఆ తరువాత సుప్రియ సాఫ్ట్‌వేర్ కంపెనీ భవనం పై నుంచి పడి ఆత్మహత్యకు పాల్పడింది.

వరకట్నం వేధింపులకు
కూకట్‌పల్లి వివేకానందనగర్‌కు చెంది న ధరణి ప్రసన్న (28) 2011లో శ్రీకాంత్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రసన్న కట్నం వేధింపులు భరించలేక ఎప్రిల్ 9, 2013నాడు కిటికి గ్రిల్స్‌కు చున్నీతో ఉరి వేసుకుని తనువు చాలించింది.