Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఐటి మత్తుపై కన్ను

కమింగో లింకులపై ఆరా తీస్తున్న సిట్

                    IT-in-Drugs

హైదరాబాద్ : టాలీవుడ్‌ను ఒక కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసు ఐటి రంగం వైపు మళ్ళింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌కు నెదర్లాండ్ నుంచి డ్రగ్స్ దిగుమతి చేస్తున్న మైక్ కమింగో విచారణను ప్రారంభించి న సిట్‌కు అనేక ఆసక్తికరమైన అంశాలు తెలిసినట్లు సమాచారం. నెదర్లాండ్‌కు చెందిన కమిం గో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని, స్థానిక యువతిని వివాహం చేసుకున్నాడని గుర్తించారు. డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు దిగుమతి చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడని తెలిసింది.

ఐటి నిపుణుడైన కమింగో పలు సాఫ్ట్‌వేర్ సంస్థలకు కన్సల్టెంట్‌గా ఉన్నాడని, ఆయా సంస్థలకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసి ఇచ్చేవాడని కూడా గుర్తించారు. పలు ఐటి సంస్థలకు చెందిన కీలకులతో పాటు ఆయా సంస్థలలో పని చేసే ఎంతో మందికి కమింగో డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో సిట్ గుర్తించింది. కమింగో నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఐటి రంగంలోని పలువురి వివరాలున్నాయ ని, కొందరితో జరిపిన చాటింగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు.

అయితే పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు విచారణ మొదటి రోజు అధికారులు చేసిన ప్రయత్నాలకు కమింగో సహాయ నిరాకర ణ చేసినట్లు సమాచారం. ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తమైన సమాచారాన్ని సేకరించేందుకు పాస్‌వర్డ్ అడ్డం వస్తుందని, పాస్‌వర్డ్‌ను చెప్పేందుకు కమిం గో నిరాకరిస్తున్నట్లు అధికారులంటున్నారు. ఫోన్‌లో దాదాపు 1500 మందికి చెందిన ఫోన్ నంబర్లున్నాయని, వీటిల్లో ఎంత మంది తరచూ కమింగోతో మాట్లాడారన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని అంటున్నారు. నగరంలో పేరొందిన పలు ఐటి కంపెనీలకు చెందిన వారితో కమింగోకు పరిచయాలున్నాయన్న విషయాన్ని నిర్ధారించుకున్నప్పటికీ ఆ పరిచయం ఐటీ సహాయం కోసమేనా? లేక డ్రగ్స్‌తో ఏమైన లింక్‌లున్నాయా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉందని అంటున్నారు.

అయితే ఖచ్చితంగా కమింగో కొంత మంది ఐటి నిపుణులకు డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు గుర్తించామని, ఇందుకు మరికొన్ని ఆధారాల కోసం ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఆధారాలు తేలితే ఐటి రంగంలోని వారిని కూడా విచారించేందుకు సిద్దమని అధికారులు పేర్కొంటున్నారు. కమింగోను తరచూ ఎవరు కలిసేవారు, అతడు హైదరాబాద్‌కు ఎలా పరిచయమయ్యాడనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలలో అధికారులున్నారు. కెల్విన్ తరచూ గోవాకు వెళ్ళాడని, అదే సమయంలో కమింగో కూడా వెళ్ళినట్లు ప్రాథమిక ఆధారాలను అధికారులు సేకరించారు. అయితే వీరిద్దరూ గోవాలో ఎవరిని కలిసే వారన్న విషయంపై దృష్టి కేంద్రీకరించారు. కమింగో కొన్ని క్లబ్‌లలో పార్టీలను కూడా నిర్వహించాడని, ఈ పార్టీలకు కెల్విన్ కూడా వచ్చాడని తేలింది. అయితే పబ్‌లలో జరిగిన పార్టీలకు వచ్చిన వారెవరనే విషయాన్ని కూడా తేల్చే పనిలో అధికారులున్నారు. ఏయే పబ్‌లలో కమింగో పార్టీలను నిర్వహించాడనే విషయాన్ని కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద కమింగో వెల్లడించే అంశాల ఆధారంగా ఐటి రంగంలోని వారిని కూడా విచారించేందుకు సిట్ సన్నద్దమవుతుందన్న విషయం స్పష్టమైంది.

Comments

comments