Home పెద్దపల్లి ఆ పరిశ్రమోస్తే మా ఊళ్ళు స్మశానాలే…

ఆ పరిశ్రమోస్తే మా ఊళ్ళు స్మశానాలే…

Exploitation

పెద్దపల్లి: ఆ పరిశ్రమ పేరు ‘సోలార్ ఎక్స్‌ఫ్లోసివ్స్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్’. మహరాష్ట్రలోని నాగపూర్ కేంద్ర కార్యాలయం గల ఆ పరిశ్రమ ప్రభుత్వ మరియు ప్రయివేటు పారాశ్రామిక రంగానికి, భారత రక్షణ రంగానికి పేలుడు పదార్థాలు సరఫరా చేసే సంస్థ . గోదావరి ఖని సింగరేణి బొగ్గు గనులకు దగ్గర్లో పరిశ్రమ నెలకొల్పే క్రమంలో పెద్దపల్లి మండలం రాగినేడు, కనగర్తి గ్రామాల శివారు ప్రాంతంలో 30 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది . ఆభూమిని కొనుగోలు చేసే సందర్బంలో పేలుడు పదార్థాల సంస్థ అని చెప్పకుండ , తమది సోలార్ ఇండస్ట్రీ అని మబ్యపెట్టి భూమిని కొనుగోలు చేశారని రెండు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.

ఆ పరిశ్రమకు సంబందించినటువంటి అనుమతులను ఎప్పుడు మంజారు చేసారో , ప్రజాభిప్రాయ సేకరణ ఎవరి వద్ద తీసుకున్నారో తమ గ్రామస్తులకు , అటు ప్రభుత్వం నుండి గాని ఇటు పరిశ్రమ యాజమాన్యం నుండి గాని ఎలాంటి సమాచారం లేదని ఆరోపిస్తున్నారు . ఆ భూమి కొనుగోలు సమయంలో కొంత మంది వ్యక్తులు మద్య వర్తుల ద్వారా తమ గ్రామానికొచ్చి మీ ఊరి లో సొలార్ పరిశ్రమ వస్తుందని , తద్వారా మీ గ్రామ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మబలకడంతో తాము వారిని ఆహ్వనించామని ,తీరా ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు తయారు చేసే సంస్థ అని తెలిసి నప్పటినుండి కంపెని అధికారులెవరు రాలేదని ఆరోపించారు.

రాగినేడు గ్రామాని కి కేవలం 200 మీటర్ల దూరంలో ఆ పరిశ్రమ భూమిని కొలుగోలు చేసిందని , ఇప్పటికే పక్కన గల బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరి వెద జల్లే కాలుష్యం వలన తమ గ్రామాల ప్రజలు అనేక రోగాల భారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు . ఆ పరిశ్రమ మాకొద్దంటూ డిసెంబర్ 2016 లో గ్రామసభ ద్వారా ఎకగ్రీవ తీర్మాణం చేసి ప్రభుత్వానికి నివేదించామని , అయినా ఎలాంటి చర్య తీసుకోలేదని వారు తెలిపారు , ఆ ప్రమాద కరమైన పరిశ్రమ నెలకొల్పితే వాయు , శబ్ద , నీటి కాలుష్యం వలన భవిష్యత్తు లో రెండు గ్రామాలు కనుమరుగవుతాయని , పరిశ్రమకిచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ 100 మందికి పైగా గ్రామస్థులు సొమవారం జరిగిన ప్రజావాణి లో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ తమ సమస్యను ఎకరువు పెట్టారు .

చేపలు మృత్యువాత
సోలార్ ఎక్స్‌ఫ్లోసివ్స్ ఇండస్టీస్ పరిశ్రమ వెదజల్లే రసాయనాల వలన ప్రక్కనే గల కొత్త కుంట , ముత్యాల కుంటలు కాలుష్యం అయి అందులో చేపలు మృత్యువాత పడే అవకాశం ఉందని రాగినేడు గ్రామానికి చెందిన కలవేణి శంకర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు . తాము ఎన్నో ఎళ్ళుగా వ్యవసాయం తో పాటు మత్సకార వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని అన్నారు . అ పరిశ్రమ మా దగ్గర నెలకొల్పితే తమ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ఉపాది కోల్పోతారని ప్రభుత్వం పరిశ్రమకిచ్చిన అనుమతుల పై పునరాలోచించాలని అన్నారు.

నిత్యప్రమాదాలు
పేలుడు పదార్థాల పరిశ్రమ వలన రెండు గ్రామాల ప్రజలు నిత్యం ప్రమాదాల మద్య జీవించాల్సి ఉంటుందని కనగర్తి గ్రామానికి చెందిన రైతు క్యాతం ళింగయ్య ఆందోళన వ్యక్తం చేశాడు . ఫ్యాక్టరి నుండి వెలు వడే రసాయనాల వల్ల పంటలు నాశనం అవడంతో పాటు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు . తనకు ఆ భూమి ప్రక్కనే 8 ఎకరాల వ్యవసాయ కలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు .

గ్రామస్తులు వద్దంటె ఎలా అనుమతిస్తారు: -ఎరుకల శ్రీధర్
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా , ప్రభుత్వం ప్రమాధకరమైన పరిశ్రమలకు ఎలా అనుమతిస్తుందని రాగినేడు గ్రామానికి చెందిన ఎరుకల శ్రీధర్ అనే యువకుడు ప్రశించాడు . గ్రామానికి 200 మీటర్లు దూరంలో ఎర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్టరి ని ఆనుకొని ప్రభుత్వ హైస్కూల్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , పశువుల ఆసుపత్రి , అంగన్ వాడి కేంద్రాలు ఉన్నాయని ఆన్నారు . ఆ భూమి నుండే ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ ద్వారా ప్రక్కనే గల కొత్త కుంట , ముత్యాల కుంటలకు నీరు వెలుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు . ప్రభుత్వం రెండు గ్రామాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశాడు .

ఆ కంపెనిని రద్దు చేయాలి: -పొన్నం మదునయ్య
సోలార్ ఎక్స్‌ఫ్లోసివ్స్ ఇండస్టీస్ పేలుడు పరిశ్రమ ను వెంటనే రద్దు చేయాలని రాగినేడు గ్రామానికి చెందిన పొన్నం మదునయ్య అనే రైతు తెలిపారు .అ పరిశ్రమ మా దగ్గర నెలకొల్పితే రాగినేడు , కనగర్తి రెండు గ్రామాలు వళ్ళకాళ్ళవుతాయని ఆయన అన్నారు . ప్యాక్టరి ఎర్పాటు స్థలం ప్రక్కన తనకు 3 ఎకరాల వ్యవసాయ భుమి ఉందని పరిశ్రమ వెదజల్లే కాలుష్యం తో పాటు అతి ప్రమాద కరమైన పేలుడు పదార్థాల వద్ద వ్యవసాయం చేయడం ఎలా సాద్యమౌతుందని ఆయన ప్రశ్నించారు .వెంటనే పరిశ్రమ అనుమతులు రద్దుచేసి రెండు గ్రామాలను రక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నాడు .