Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రోదసీ నుంచి సౌరశక్తి సేకరణ

Solar-Power-Take-from-Sky

రోదసీ నుంచి సౌరశక్తిని గ్రహించడం విలువైన వనరుగా పరిశోధకులు భావిస్తున్నారు. గ్లాస్‌గౌలోని స్ట్రాత్ క్లైడ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ మేరకు పరికరాలు అమర్చి పరిశోధనలు చేశారు. సౌరశక్తిని సేకరించడానికి వీలుగా సోలార్ ప్యానెళ్ల వేదికను ఏర్పాటు చేసి మైక్రోవేవ్‌లు, లేదా లేసర్ల ద్వారా తిరిగి భూమికి ఆ శక్తిని పంపించగలిగారు. ఈ పురోగతి వల్ల విద్యుత్ వనరులు మరింత సమగ్రంగా ఏర్పాటు చేసినట్టు అవుతుంది. ఏ మాత్రం విద్యుత్ వెలుగులు అందించడానికి వీలులేని ప్రాంతాలకు విద్యుత్తు దీని ద్వారా అందించవచ్చు. సౌరశక్తిని విస్తృతంగా వినియోగించడానికి కావలసిన అవకాశాలు రోదసీలో ఉన్నాయని, వాతావరణ పరిస్థితులతో, పగటి సమయాలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు విద్యుత్తును వాడుకోవచ్చని పరిశోధకులు వివరించారు. సహారా ఎడారి వంటి ప్రాంతాల్లో నాణ్యమైన సౌరశక్తి లభిస్తుంది. అయితే ఎక్కడైతే ఈ శక్తి అవసరమో అక్కడకు సరఫరా చేయడం మాత్రం కష్టం. ఈ అవాంతరాల్ని ఎలా తొలగించాలన్న అంశంపైనే ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

Comments

comments