Home తాజా వార్తలు సోలార్ ప్రీమియర్ మాడ్యుల్ ప్రారంభం

సోలార్ ప్రీమియర్ మాడ్యుల్ ప్రారంభం

KTR

సంగారెడ్డి : జిన్నారం మండలం అన్నారంలో సోలార్ ప్రీమియర్ మాడ్యుల్ యూనిట్‌ను తెలంగాణ మంత్రి కెటిఆర్ శనివారం ప్రారంభించారు. సోలార్‌తో నడిచే ఈ రిక్షా, ఈ బైక్, ఈ సైకిల్‌ను కెటిఆర్ ఆవిష్కరించారు. వంద కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన ప్రీమియర్ సోలార్ పరిశ్రమ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయాలన్న ధ్యేయంతో సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని కెటిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Solar Premier Module Launch