Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

చర్చలతోనే సమస్యలు పరిష్కారం

* గత ప్రభుత్వాలకన్న ఇప్పుడు ఎంతో మేలు
* ప్రశ్నోతరాల కార్యక్రమంతో ఎన్నో సమస్యలు వెలుగులోకి
* ఒంటరి మహిళకు పెన్‌షన్ విధానం ఎక్కడా లేదు
SWAMY

మనతెలంగాణ/నర్సాపూర్ : ప్రజా సమస్యలపై శాసన మండలిలో చర్చించినప్పుడే ,అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. బుదవారం నాడు శాసన మండలి చైర్మేన్ స్వామిగౌడ్ నర్సాపూర్ వచ్చిన సందర్భంగా స్థానిక ఎంపిపి కార్యాల యం వద్ద పోలీసులు గౌరవ వందనం చేయడం జరిగింది. అనంతరం ఎంపిపి కార్యలయంలో శాలువతో సత్కరించారు.

ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై శాసన మండలిలో అన్ని పార్టీల వారు చర్చించినపుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతి ఒక్కరు వారి వారి ప్రాంతంలోని, అదేవిధంగా ప్రజాసమస్యలు తెలియ చెప్పడంతో అందరికి సమాన అవకాషం కల్పిస్తు, వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకొవడానికి వీలు అవుతుందన్నారు. వివిధ పార్టీలు కాని పోని విషయాలలో పట్టుబట్టి వాయిదా తీర్మానాలు అంటు గగ్గోలు పెడితే లాభం ఉండదని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ నాడు తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఫెన్‌షన్ విధానం తీసుకు రావడం ఎంతో ఆలోచించ దగ్గ విషయమన్నారు.
అందరి సమిష్టి కృషితోనే తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమావుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి,జెడ్‌పిచైర్ పర్సన్ రాజమణి, ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు హబీబ్ ఖాన్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

Comments

comments