Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గ్లోబల్ టెక్నాలజీ సహాయంతో సమస్యల పరిష్కారం: దావోస్ లో మంత్రి కెటిఆర్

KTR

హైదరాబాద్: గ్లోబల్ టెక్నాలజీ సహాయంతో స్థానిక సమస్యలను పరిష్కరించుకోడానికి కృత్రిమ (ఆర్టిఫిసియల్) మేధస్సును ఉపయోగించుకోవాలని మ్రంతి కెటి రామారావు అన్నారు. దవోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్లుఇఎఫ్) 2018 లో గ్లోబల్ టెక్నాలజీ, స్థానిక సమస్యల పరిష్కారం అంశంపై ఆయన ప్రసంగించారు. క్రమబద్దీకరణ సమస్యలపై మొదట దృష్టిసారించాలని, అర్థవంతమైన డాటాను ఉత్పత్తి చేయడం వల్ల కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు కల్గుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో ఒపెన్ డాటా పాలసీని ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఇపుడు ప్రజల కోసం 50 డాటా సెట్లు తెరవబడి ఉన్నాయన్నారు. ఒపెన్ డాటా పాలసీ పారదర్శకత కోసమే గాకుండా నాణ్యమైన డాటా సేకరణ ఉపయోగపడేలా చేయడానికి దోహదపడుతుందన్నారు. దీని వల్ల సమస్యల పరిష్కారాలు లభిస్తాయన్నారు. సాంక్కృతిక, ప్రాంతీయ, భాషా వ్యత్యాసాలను ఎలా తెలుసుకోవాలనే దానిపై దృష్టిసారించాలన్నారు. స్థానిక సమస్యల పరిష్కారాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రజల స్థానిక నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. గ్లోబల్ సంస్థలు స్థానికంగా పనిచేయడం ప్రజలకు సహకరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

Solve problems with the help of global technology said Telangana minister KTR in Davos 

Comments

comments