Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సమన్వయంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం

DGPమన తెలంగాణ/ఆసిఫాబాద్ : ప్రజా సంక్షేమం కొ రకు ప్రభుత్వ అధికారులు తమ సొంత ప్రయోజనాలను సైతం వదులుకుని పనిచేయాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అధికారులకు సూచించారు. శనివారం కుమ్రం భీం జిల్లా కేంద్రాని కి రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డితో కలిసి వచ్చిన ఆయనకు హెలిప్యాడ్ వద్ద జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమా ర్ పుష్పగుచ్చమందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజిపితో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన తెగల మధ్య నెలకొన్న సమస్యలపై రెండు తెగల కుల పెద్దలతో మాట్లామన్నారు. వారి నుండి సానుకూలంగా స్పందన లభించిందని తెలిపారు. జిల్లాలో పలు గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేనప్పటికీ జిల్లా ప్రజలు మంచి గుణం కలవారిన కితాబునిచ్చారు. సౌమ్యులైన గిరిజన తెగల మధ్య చిన్న సంఘటన రేపిన వివాదం పరిష్కారానికి అన్నిశాఖల అ ధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నారన్నా రు. ఆదివాసుల నుండి వస్తున్న స్పందనతో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఆశిస్తున్నామన్నారు. ప్రజ లు కూడా వదంతులను నమ్మకుండా అధికారులకు సహకరించి జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లెందు కు సహకరించాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవ న్ పాటిల్ మాట్లాడుతూ గిరిజన ఆవాసాల అభివృద్ధి కి పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోర గా సీఎస్ సానుకూలంగా స్పందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న లంబాడీ ఉద్యోగులను మైదా న ప్రాంతాలకు బదిలీచేసి మైదాన ప్రాంతాల వారిని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీచేస్తే సమస్యకు కొంత వర కు పరిష్కారం లభిస్తుందని పలువురు జిల్లా అధికారులు సీఎస్ ఎస్పీ సింగ్‌ను కోరారు. ఈ సందర్భంగా డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సామరస్యంతో పోలీసులకు స హకరించాలని,  చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. పోలీసుశాఖ, అన్నిశాఖల సమన్వయంతో సమస్య సాధనకు కృషిచేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రామకృష్ణారావు, ట్రైబల్ వెల్ఫర్ కమీషనర్ సోమేష్‌కుమార్, అడిషనల్ డిజి అంజలికుమార్, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీకర్ణన్, జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగనెవార్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments